జనసేన అధినేత ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుండి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ చూసిన వారికి తను టీడీపీకి ఎప్పుడైతే దగ్గర అయ్యాడో ఆరోజు నుండి ఆస్థులు పెరిగాయని తన పేరిట కోట్ల విలువ చేసే భూములు, కార్లు వచ్చాయని అర్థమవుతుంది అంటూ ఏపీలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కి దగ్గరగా జరిగిన 2022 నుండి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 14 కోట్ల విలువైన కారులు కొన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు , పవన్ కళ్యాణ్,అతని అన్న నాగబాబు , జనసేన ముఖ్య నాయకులు ఏ సభ జరిగినా లేదా ఏ సందర్భం వచ్చినా పవన్ కళ్యాణ్ కు కారు లేదు అంటూ బీద మాటలు చెప్పటం. ఈరోజు మాత్రం 14కోట్ల విలువైన కారులు చూపిస్తున్నారు. ఇన్ని రోజులు తమ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య జనులను తమ మోసపు మాటలతో మభ్యపెట్టారు అని విశ్లేషకుల మాట.
మరో వైపు టీడీపీకి దగ్గరైన తొలినాళ్ళలో హైదరాబాద్ లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్లతో జూబ్లీహిల్స్ లో ఒక బిల్డింగ్ కొన్నారు, బహిరంగా మార్కెట్ లో దాని విలువ దాదాపు 60 కోట్ల పైనే వుంటుంది. అదే సమయంలో హైదరాబాద్ లోనే ఖాజీగూడలో ప్రభుత్వ ధరల ప్రకారం 18 కోట్లతో ఒక ప్రాపర్టీని కొన్నారు, ఈ ప్రాపర్టీ కూడా బహిరంగ మార్కెట్ లో దాని విలువ దాదాపు 80 కోట్ల పైనే వుంటుంది. ఇవన్నీ కూడా టీడీపీకి దగ్గరైనా తొలినాళ్ళలోనే కొన్నవి. అంతే కాకుండా ఇదే సమయంలో తన మూడో భార్యకు ప్రభుత్వ లెక్కల్లో 2 కోట్ల రూపాయల విలువైన ఇంటిని గిఫ్టు గా ఇచ్చారు అని , ఆమె పిల్లలు కూడా 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తిలో 50% వాటా కలిగి వున్నారు అని పవన్ కళ్యాణ్ తన ఎన్నికలు అఫిడవిట్ లో పొందుపరిచారు. వీటి విలువ 100 కోట్ల పైనే వుంటుంది. కనీసం కారు లేదు అని చెప్పుకునే పవన్ దాదాపు 250 కోట్ల విలువైన ఆస్తులు కేవలం సంవత్సర కాలంలో ఎలా సంపాదించారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా అదికూడా టీడీపీతో పొత్తు కుదిరిన సమయాల్లోనే జరగడం గురించి ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
అసలు విషయం మరొకటి ఏమిటంటే బిజెపి,టీడీపీ,జన సేన పొత్తు కుదిరే సమయాల్లోనే అంటే దాదాపు నెల క్రితం పవన్ కళ్యాణ్ హైదరబాద్ పదహారు కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు అది బహిరంగ మార్కెట్ లో వంద కోట్ల పైనే వుంటుంది. అదే విధంగా మంగళగిరిలో 7 కోట్లతో మరో ప్రాపర్టీని కొన్నారు . అలాగే పవన్ కళ్యాణ్ తల్లి గారు అక్కడే 4కోట్ల విలువైన ప్రాపర్టీని కొని పవన్ కళ్యాణ్ కు గిఫ్టు గా ఇచ్చారు అని తన ఎలక్షన్ అఫిడవిట్ లో క్లియర్ చెప్పడంతో టీడీపీ బిజెపి పొత్తు కుదిర్చినందుకు అందులో టీడీపీకి తమ సీట్లు వదులుకున్నందుకు పెద్ద మొత్తంలో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా లబ్ధి చేకూర్చారు అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు.
ఇలా టీడీపీ, జన సేన పార్టీలు కలిసి పనిచేసే సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆస్థులు కొనడం అది వందల కోట్ల విలువచేసే వాటిని కొనడం వీరిద్దరి మధ్య ఉన్న చీకటి కోణాల్ని తెలుపుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ఆరోపిస్తున్నారు.