అల్లు కుటుంబంపై పవన్ కళ్యాణ్‌కు ఎందుకంత కోపం.. సినీ వర్గాల్లో జరిగే చర్చ ఇది. సేనాని వెంట చాలాకాలం నడిచి.. ఆయన వ్యవహారశైలి నచ్చక ఇటీవల బయటకు వచ్చేసిన పోతిన మహేష్ తాజా వ్యాఖ్యలతో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ‘పవన్ కళ్యాణ్ సభల్లో చాలామంది హీరోల పేర్లు చెప్పారు. అందరం కలిసి ఉండాలన్నారు. సినిమాల విషయం పక్కనపెడితే ఇది రాష్ట్ర భవిష్యత్ కోసమని, అందరూ తన వెంట రావాలని అడిగారు. మరి మెగా కుటుంబంలో ఒక వ్యక్తి అయిన అల్లు అర్జున్ గురించి ఎందుకు మాట్లాడలేదు. ఎప్పుడూ నాలుగు మాటలు చెప్పింది లేదు. దీనికి కారణమేంటో చెప్పండి’ అని మహేష్ అడిగారు.
అల్లు కుటుంబంపై పవన్ కోపం ఈ నాటిది కాదు. ప్రజారాజ్యం సమయం నుంచే వారి మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. టికెట్ల వ్యవహారంలో గొడవ మొదలైనట్లు సీనియర్ మెగా అభిమానులే చెబుతుంటారు. పీఆర్పీలో అల్లు అరవింద్ మాట బాగా చెల్లుబాటైంది. చిరంజీవి ఈయన మాటే ఎక్కువగా వినేవారు. కొన్ని సీట్లను అరవింద్ ఆనాడు తన మనుషులకు ఇప్పించుకోవాలని చూడగా, పవన్ వాటిపైనే పట్టుపట్టారని, దీంతో రగడ జరిగిందని ప్రచారం ఉంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని చిరు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అరవింద్ బడా నిర్మాత. సినీ పరిశ్రమ పెద్దగా చాలాకాలం నుంచి ఉన్నారు. ఆయన్ను తొక్కడానికి పవన్ చాలా ప్రయత్నాలే చేశారని చెబుతుంటారు. అరవింద్ తనయుడు అల్లు అర్జున్ (బన్నీ) ఇండస్ట్రిలో నిలదొక్కుకున్నారు. తొలిరోజుల్లో అండగా నిలిచిన చిరు ఆ తర్వాత పవన్ ఒత్తిడితో కాస్త దూరం జరిగారు.
అర్జున్ ఎదుగుదల పవన్ కళ్యాణ్‌కు ఇష్టం లేదని పోతిన మహేష్ మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రిలో ఉన్న టాక్‌కు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా బన్నీ సినిమాలు విడుదలైనప్పుడు పవన్ అభిమానులు సైకోల అవతారమెత్తుతారు. యూట్యూబ్‌లో ట్రైలర్లు, పాటల వీడియోలకు డిస్ లైక్స్ కొడుతుంటారు. బూతులతో నిండిన కామెంట్స్ పెడుతుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అడ్డదిడ్డంగా పోస్టులు పెడుతుంటారు. సినిమా మొదలు కాకుండానే చెత్తగా ఉందని ఫేక్ రివ్యూలు రాస్తుంటారు. వీటిని చూసి విసిగెత్తిపోయిన అర్జున్ ఫ్యాన్స్ పలుమార్లు బహిరంగంగానే సేనాని అభిమానుల తీరును తప్పు పట్టారు. అయినా వారి మారలేదు.
పవన్ దృష్టిలో చిరంజీవి, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ్ మాత్రమే హీరోలు, అల్లు అర్జున్ను అనామకుడిగా చూస్తుంటాడు. ఏనాడూ అతని గురించి మంచి మాటలు మాట్లాడకపోగా అభిమానుల చేత తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. మెగా హీరోలందరూ పవన్ భజనలో తరిస్తుంటారు. మూవీ ఫంక్షన్లలో అయితే ఓ రేంజ్లో పొగిడేస్తుంటారు. ఓసారి అర్జున్ తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. పవన్ పేరు చెప్పలేదనే సైకో ఫ్యాన్స్ కక్ష కట్టినట్లు తెలుస్తోంది. దీనికితోడు పీఆర్పీ నుంచి అరవింద్‌పై ఉన్న కోపంతో అల్లు కుటుంబాన్ని సేనాని చిన్నచూపు చూస్తుంటాడని ప్రచారం ఉంది.