జగన్ కి మేలు చేసేది , జగన్ కి పేరు వచ్చేది ఏదీ కూడా మనం చూడకూడదు, మాట్లాడ కూడదు, వినకూడదు అనే గాంధీ గారి మూడు కోతుల సిద్దాంతంలోకి వేళ్ళిపొయారు ఏపీలోని ప్రతిపక్ష పార్టీ నేతలు. గతంలో ఎన్నడు జరగనంత అభివృద్ది జరిగినా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేసి చూపలేని అంత సంక్షేమం జగన్ ప్రభుత్వం చేసినా ఒప్పుకోలేని స్థాయిలోకి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారు. దీంతో చంద్రబాబు చెప్పు చేతల్లోనే ఉంటూ నిత్యం జగన్ పై అర్ధంలేని ఆరోపణలతో తన వ్యక్తిగత అక్కసు తీర్చుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఈయన వ్యవహార శైలి చూసిన ప్రతి ఒక్కరికి ఇట్టే అర్ధం అయ్యే అంశం ఇది.
తాజాగ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడ బీచ్ ను మద్రాస్ లో ఉన్న మెరీనా బీచ్ లా తయారు చేసుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసుకుందామని వెల్లడించారు. అయితే ఇక్కడే ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న తమిళనాడులో ఉన్న మేరినా బీచ్ గొప్పతనం ఏమిటని.? ఆ స్థాయిలో ఉన్న బీచ్ మరొకటి ఆంధ్రాలో లేక పవన్ కళ్యాణ్ ఎక్కడో మద్రాస్ నగరంలో ఉన్న మెరీనా బీచ్ గురించి మాట్లాడారా అనే అనుమానాలు సామాన్యుల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. కాస్త లోతుగా చూస్తే ఇక్కడే పవన్ కళ్యాణ్ లో నరనరాన జగన్ పై ఉన్న అక్కసు బయట పడుతుంది.
నిజానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక పర్యాటక రంగంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ గైడ్ లైన్స్ కి లోబడే 363 బీచ్లను అభివృద్ధి చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే క్లీన్ బీచెస్ కింద ప్రభుత్వం తీసుకున్న చొరవకి రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చింది. ఇది తమిళనాడులో ఉన్న మెరీనా బీచ్ కి లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఉదాహరణకు మేరినా బీచ్ అంటున్నారే కానీ మన రాష్ట్రంలోనే ఉన్న మెరీనా కన్నా మేలైన రుషికొండ బీచ్ ని మాత్రం ఆదర్శంగా చెప్పడంలేదు. కారణం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ బీచెస్ గురించి చెబితే పేరు వచ్చేది జగన్ కి , దానిని ప్రతిపక్ష నాయకులు సహించలేరు.
ఇంకా చెప్పాలంటే జియాగ్రఫికల్ గా ఏ బీచ్ కి ఉన్న ప్రత్యేకత ఆ బీచ్ కే ఉంటుంది. కొన్ని రాక్ బీచెస్ ఉంటే కొన్ని సాండ్ బీచెస్ ఉంటాయి. జియాగ్రఫికల్ గా చూస్తే ఉప్పాడ బీచ్ ఎప్పటికి మెరినా బీచ్ కాలేదు. మెరినా బీచ్ ప్రపంచంలోనే అతి పోడవైన రెండో బీచ్ గా చెబుతారు. కానీ ఉప్పాడ బీచ్ పూర్తిగా మెరీనాకి భిన్నంగా ఉంటుంది పైగా ఈ ఉప్పాడ ప్రాంతం తాబేళ్ళు గుడ్లు పెట్టే ప్రాంతం. ప్రభుత్వాలకి కూడా వాటి రక్షణ ఎంతో ముఖ్యం అక్కడ పెద్ద ఎత్తున బీచ్ తయారు చేయడం కుదరదు కారణం తీరంలో ఎక్కడ చూసినా సముద్ర కోతకు రక్షణగా వేసిన రాళ్లు మాత్రమే ఉంటాయి. ఇది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ మెరినా బీచ్ మాదిరి ఉప్పాడ ని అభివృద్ది చేసుకుందాం అని చెప్పడం కాకినాడ ప్రజలని మోసం చేయడమే అని అక్కడి ప్రజలే చెబుతున్న మాట. ఎన్నికలయ్యేలోపు పవన్ కళ్యాణ్ ఇంకెంత దిగజారుతాడో చూడాలి .