ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎస్టేట్లో పవన్ కళ్యాణ్ ఒక మార్కెటింగ్ మేనేజరని ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని కిర్లంపూడి గ్రామంలో తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా కుటుంబాన్ని బజార్ కి ఎక్కించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఏమొచ్చిందని మండిపడ్డారు. కాగా పవన్ కళ్యాణ్ నిన్న తునిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ తాను రాబోవు ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కుమార్తె అయిన క్రాంతికి సీట్ కేటాయిస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం మీద పరుష పదజాలం వాడారు. దానికి స్పందించిన ముద్రగడ నా కుటుంబాన్ని గురించి ఆ డయాస్ మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని అన్నారు.
డయాస్ మీద నా కూతుర్ని పరిచయం చేసినట్లు నీ ముగ్గురు భార్యలను పరిచయం చేయాల్సిందని అన్నారు. నేను ఈరోజు చిరంజీవి గురించి గానీ , నీ గురించి గానీ పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు లేవు అయినా మీరు నా కుటుంబ విషయంలో దూరారు. మా కుటుంబాలని బయటపెట్టిన విధంగానే మీ అన్న కూతుర్లు లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు, డ్రగ్స్ సేవిస్తూ పట్టుకున్నప్పుడు డయాస్ మీద నిలబెట్టి మాట్లాడించాల్సింది అని అన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే సీట్ కే దిక్కులేదు, నా కూతురికి రానున్న ఎన్నికల్లో సీట్ కేటాయిస్తా అంటున్నాడు, ఇలా చెప్పి ఇప్పటికే చాలామంది నాయకుల్ని ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మోసం చేశాడన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎస్టేట్లో ఒక మేనేజర్ అని చంద్రబాబు ఎలా చెప్తే అలా తోక ఆడించిందాల్సిందే అని మీడియాతో తెలిపారు.