‘పవన్ కళ్యాణ్ రికరెంట్ ఇన్ఫుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నెమ్ముజేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దు. అదే విధంగా కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయొద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ రెండు రోజుల క్రితం జనసేన పార్టీ ప్రెస్‌నోట్ విడుదల చేసిన ప్రెస్‌నోట్ సారాంశమిది.
సేనాని కొద్దిరోజులుగా సభలకు వెళ్లేందుకు భయపడుతున్నాడని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తనను బ్లేడ్లతో కోయాలని చూస్తున్నారని ఆరోపించాడు. దీనికి చాలా కారణాలున్నట్లు చర్చ నడుస్తోంది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పవన్ ఆడుతున్నాడని అందరూ నమ్ముతున్నారు. 21 సీట్లు మాత్రమే తీసుకుని, వాటిలో చాలా వరకు టీడీపీ వారికే ఇవ్వడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంకా చాలాచోట్ల తెలుగు తమ్ముళ్లు జనసైనికులను కొడుతున్నారు. ఈ విషయం తెలిసినా సర్దుకుపోవాలని పవన్ తమవారికి చెబుతున్నాడు. మరోవైపు టీడీపీ నేతలు చాలామందికి సేనతో పొత్తు ఇష్టం లేదు. ముఖ్యంగా బాబు తన తనయుడు లోకేశ్‌ను కాదని పవన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని చాలామంది తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తన అభిమానులే కావొచ్చు.. తెలుగుదేశం వారు కావొచ్చు.. రాళ్లు వేస్తారని, బ్లేడ్లతో కోస్తారని సేనాని భయపడుతున్నట్లు ఆయన సన్నిహితులు వాపోతున్నారు. అందులో భాగంగానే ప్రెస్‌నోట్ విడుదలైనట్లు తెలుస్తోంది. అనారోగ్యాన్ని సాకుగా చూపించినట్లు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ‘జగన్ గారికి ఇలా దెబ్బ తగిలిలిందని చెప్పారు. నన్ను ఏం చేయమంటారని అడిగా. నిజమో.. అబద్ధమో నాకేం తెలుసు. అతనే టప్మని కొట్టేసుకుని ఉండొచ్చు కదా.. ఎవరికి తెలుసు. దండల్లో రాయి పెట్టుకుని కొట్టుకున్నారేమో.. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. నాటకాలు భరించలేకపోతున్నాం’ అంటూ దిగజారి మాట్లాడాడు. కట్ చేస్తే ఇప్పుడు తన అభిమానులను చూసి భయపడే స్థాయికి పడిపోయాడు. పూలమాల వేసేందుకు ఎవరైనా వస్తే వణికిపోతున్నాడంట. ఫొటో కోసం వచ్చిన వారిని అనుమానంగా చూస్తున్నాడు. అందువల్లే రక్షణగా ప్లాస్టిక్ పలకలను సిబ్బంది అడ్డుపెడుతున్నారు. పైకి ధైర్యవంతుడిలా భలే నటిస్తాడు పవన్. ఇతరులను హేళనగా మాట్లాడి తన దగ్గరకు వచ్చే సరికి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాడు. గుడ్డిగా నమ్మే గొర్రెలు, సైకోలు ఉన్నంత కాలం ఇంతేలే..