‘జైలుకు.. బెయిలుకు మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతోంది. అమలాపురం క్లాక్ టవర్ నుంచి చెబుతున్నా. జగన్.. నీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. నిన్ను జైలుకు పంపిస్తాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో ఆయన దేశంలోనే అత్యంత అవినీతిరుపరుడైన టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన నిలబడి ఈ మాటలన్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పవన్‌కు అక్కసు ఉంది. అందుకే ఇటీవల అధఃపాతాళానికి తొక్కేస్తా అన్నాడు. ఇప్పుడు జైలుకు పంపుతానని అరుస్తున్నాడు. సేనాని అసలు విషయం మర్చిపోయినట్లు ఉన్నాడు. చంద్రబాబే బెయిల్‌పై తిరుగుతున్న నేత. జగన్‌పై కేసులు నమోదు కావడానికి కారణం ఆయనేని జగమెరిగిన సత్యం. ఇందుకోసం కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యాడు. ఆ పార్టీ, టీడీపీ నేతలు కేసులు వేస్తే అప్పడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న సోనియా గాంధీ ఎలా వ్యవస్థల్ని ప్రయోగించారో ప్రజలందరికీ తెలుసు. చేయని తప్పునకు జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు. బెయిల్ కూడా రాకుండా చంద్రబాబు అండ్ కో అడ్డుకున్నారు.
ఇక చంద్రబాబు విషయానికొస్తే వ్యవస్థలు మేనేజ్ చేస్తూ తన అవినీతి బయటపడకుండా చూసుకున్నారు. కనీసం విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుని స్టే నాయుడిగా పేరుగాంచారు. ప్రజా సొమ్ములను అక్రమంగా జేబులో వేసుకున్న వ్యక్తితో చేరి ఆ పాపాల్లో తనకు భాగం ఉందని సేనాని చెప్పకనే చెప్పారు. బాబుపై ఎన్నో కేసులున్నాయి. వాటిల్లో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కాం. ఎల్లో గ్యాంగ్ రూ.241 కోట్లు కొట్టేసింది. గతేడాది బాబు అరెస్ట్ అయ్యారు. తొలుత అనారోగ్య కారణాలను సాకుగా చూపించి హైకోర్టు నుంచి మధ్యంత బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరో కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి కుంభకోణం ఇది. ఇందులో నారా వారే ఏ–1. ఇసుక కుంభకోణం. మహిళా సంఘాల మాటున ఇసుకను కొల్లగొట్టింది తెలుగు తమ్ముళ్లే. ఈ కేసులో ఆయన ఏ–3గా ఉన్నారు. మరొకటి మద్యం కేసు. టీడీపీ నేతల బార్లు, డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని బాబు, అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ శ్రీ నరేష్‌పై కేసు నమోదైంది. అన్ని కేసుల్లో హైకోర్టు నుంచి బాబు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అంగళ్లు కేసు.. యుద్ధభేరి పేరుతో ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఈ కేసులో బాబు ఏ–1. ఇందులోనూ ముందస్తు బెయిల్ పొందారు. ఫైబర్ నెట్ స్కాం.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసులోనూ చంద్రబాబుæ ఉన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అనేక కేసుల్లో ఇరుక్కుని.. వాటిల్లో బెయిల్ తెచ్చుకుని రాజకీయాలు చేస్తున్న ఏకైక వ్యక్తి దేశంలో బాబే. మరి కేసులను ధైర్యం ఎదుర్కొంటున్న జగన్‌పై ఏడుపెందుకు పవన్. జగన్ అనారోగ్య కారణాలు చెప్పి తప్పించుకోలేదు. విచారణను ఎదుర్కొంటున్నారు. కానీ ఆయన్ను నిలువరించేందుకు ఎల్లో గ్యాంగ్ ఎన్నో కుట్రలకు పాల్పడుతోంది. అయినా ఐదు సంవత్సరాలపాటు ప్రజలకు మంచి చేసినందుకు జగన్‌ను జైలుకు పంపుతానంటున్నావు. నీ దత్త తండ్రి 14 ఏళ్ల పాలనపై పూర్తి విచారణ చేస్తే శేష జీవితం జైల్లోనే గడిచిపోతుంది.