టీడీపీ హయాంలో ప్రపంచ స్థాయి రాజధాని కడతానంటూ
గుంటూరు జిల్లాలోని ఒక ప్రాంత రైతుల వద్ద 33000 ఎకరాల భూమి సేకరించటంతో పాటు, అక్కడి ప్రభుత్వ భూమి కలుపుకొని 56000 ఎకరాల ప్రాంతానికి అమరావతి అనే పేరు పెట్టిన బాబు అయిదేళ్లలో మూడు తాత్కాలిక భవనాలు, కొన్ని పునాదులు, కొన్ని మొండి గోడలు మాత్రమే కట్టి చేతులెత్తేసాడు కానీ ఈ లోపు అక్కడ చేసిన అక్రమాలు తక్కువేం కాదు.
రాజధాని ప్రకటించక ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ అక్రమాలకు తెరలేపిన బాబు అండ్ కో aa ప్రాంతంలో అమాయక రైతుల వద్ద నుండి వేల ఎకరాలు తక్కువ ధరకే కొనేసి అంతులేని లబ్ది పొందడంతో పాటు అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూముల రెవిన్యూ రికార్డులు మాయం చేసి ఆ భూములన్నీ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆచరణ సాధ్యం కాని ప్రపంచ స్థాయి నగరాన్ని ప్రకటించిన బాబు 2019 లో ఘోర ఓటమి పాలయ్యాక ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రికరించి మిగతా ప్రాంతాలకు అన్యాయం చేయటం కరెక్ట్ కాదని మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలంటే వికేంద్రికరణ ద్వారానే సాధ్యమని తమ విధానాన్ని స్పష్టం చేయగానే బాబు సహా టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు .
అదే జరిగితే రైతుల పేరిట తాము కొన్న భూముల ధరలు పెరగవని భావించిన బాబు అండ్ కో అభివృద్ధి వికేంద్రికరణను తీవ్రంగా వ్యతిరేకించటంతో పాటు రైతుల పేరిట ఉద్యమాలంటూ వివాదాలకి తెర తీశారు. చరిత్రలో ఖరీదైన ఉద్యమంగా పేరు పొందిన ఈ వివాద సమూహనికి వచ్చిన విరాళాలు వందల కోట్లు . అలా నెలల తరబడి ఈ గొడవ సాగినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో నిదానంగా చల్లబడింది ఈ ఉద్యమం. తాత్కాలిక సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో వేసిన ఉద్యమ శిభిరాల్లో ఉదయం పత్రికలు చదివేవారు తప్ప రెగ్యులర్ ఉద్యమకారులు కనబడటం రానురాను తగ్గిపోయింది.
కానీ శిభిరాలు మాత్రం పీకేయకుండా ఉద్యమానికి 1000 వ రోజు, 1100 వ రోజు లాంటి మైలు రాయి దినాలు వచ్చేటప్పుడు మాత్రం టీడీపీ ప్రేరణతో మళ్ళీ నాలుగు రోజులు శిభిరాల్లో హడావుడి చేసి సద్దుమనగడం పరిపాటి అయ్యింది. ఈ నెల 25 వ తారీఖుతో అమరావతి అల్లర్లు ప్రారంభమయ్యి 1500 రోజులు అవుతుంది. ఈ సందర్భ్తాన్ని పురష్కరించుకొని ఇటీవల సంక్రాంతికి కూడా బూజు దులపని దీక్షా శిభిరాల బూజు దులిపి నినాదాల పోస్టర్స్ తో అలంకరించి సిద్ధం చేస్తున్నారు.