ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా ఏకమైన కూటమి పార్టీల మధ్య ఆరని చిచ్చు రగులుకుంది. పొత్తు లో భాగంగా సీట్ల కేటాయింపులు ఆయా పార్టీల మధ్య మనస్పర్ధలకు కారణాలు అయ్యాయి. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ సీటు ఆశించిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ పై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ది మేడిపండు చూడ మేలిమై యుండు… పొట్ట విప్పి చూడు పురుగులుండు..
లాంటి వ్యక్తిత్వమని విమర్శలు గుప్పించారు.
విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి అయిన సుజనా చౌదరి మహా న్యూస్ ఛానల్ సాక్షిగా మీ తల్లిని దూషించారు. అలాంటి సుజనా చౌదరికి మీరు ఎలా టికెట్ ఇప్పిస్తారు? కన్న తల్లిని విమర్శించి, పచ్చ నోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా అంటూ ఎద్దేవా చేశారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ స్వలాభాల కోసం కాపు యువతను నమ్మించి మోసం చేయొద్దు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చి మేము పార్టీ కోసం మా సొంత ఆస్తులు అమ్ముకుని రోడ్డుమీద నిలబడితే మీరు ఆస్తులు కొనుక్కున్నారు, రక్త మాంసాల మీద మీరు భవంతులు నిర్మించుకున్నారు అని తీవ్రంగానే విమర్శించారు.
ఒక పార్టీ అధ్యక్షుడివి అయ్యుండి పిఠాపురంలో గెలవడానికి వేరే పార్టీ నాయకులు కాళ్లు ఎందుకు పట్టుకున్నావని సూటిగా ప్రశ్నించారు. అసలు అనకాపల్లి సీటు ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? నాగబాబు అనకాపల్లి వెళ్లిన తర్వాత పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు. వాళ్లు కంప్లైంట్ ఇవ్వాలను ఉంటున్నారని తెలిసి ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ఉన్నఫలంగా రాత్రికి రాత్రి అనకాపల్లి నుంచి హైదరాబాద్ పారిపోయి వచ్చేసారు అని కుండబద్దలు కొట్టేశారు.
త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా? మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా? పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుకదా… పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు? పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు? సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా? ఇదెక్కడి సామాజిక న్యాయం ? అంటూ తన ప్రశ్నలతో పోతున మహేష్ పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ నాయకత్వాన్ని ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేశారు. నమ్మి వెంట నడిచిన నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ భవిష్యత్తు ని ఇచ్చేవాడు నాయకుడు అవుతాడు తప్ప, నమ్మించి తడిగుడ్డుతో గొంతు కోసేవాడు కాదు అని పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాడు. ఒక దశలో పిఠాపురంలో జరిగే నీ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి నీ భార్య అన్నా లెజెండ్ అవ్వతో సహా కలిసి రాగలవా అంటూ పవన్ వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేశాడు.