కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ‘2024లో మొట్టమొదటి సమావేశానికి కాకినాడ పట్టణానికి విచ్చేసిన జగనన్నకు హ్యపీ న్యూ ఇయర్. రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన నాయకుడు మన జగనన్న, మాతో పాటు ఏపీ ప్రజలు కూడా అదృష్టవంతులు, 2019లో నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి కాకినాడ పట్టణంలో ఇచ్చిన పెన్షన్లు 14,700, కానీ ఇప్పుడు జగనన్న మంచితనంతో ఈ రోజు సుమారు 29,100 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో పెన్షన్ కావాలంటే ఎవరైనా చనిపోతే అధికారుల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు అర్హులైతే చాలు పెన్షన్ ఇస్తున్నారు, మాట ఇచ్చిన ప్రకారం రూ. 3,000 ఇస్తున్నారు, రాబోయే రోజుల్లో అన్ని పథకాలు అందుతాయి. చంద్రబాబు ఒక్క పథకమైనా పెట్టారా చెప్పండి, ప్రజలకు అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరు ఎక్కడైనా ఒక్క రూపాయి లంచం ఇచ్చారా, లంచాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం మాత్రమే. ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రికి మనం అంతా జేజేలు పలకాలి. కాకినాడలో 94 వేల కుటుంబాలు ఉంటే 84 వేల కుటుంబాలు నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిపొందారని అన్నారు .
గతంలో పెన్షన్ ఎప్పుడిస్తారో తెలిసేది కాదు
వారలక్షి అనే పెన్షనర్ మాట్లాడుతూ నాకు గత ప్రభుత్వంలో ఎవరూ పెన్షన్ ఇవ్వలేదు, ఏ అధికారి ఇవ్వలేదు బాబు, కానీ జగన్ బాబు వచ్చిన రెండో నెలలోనే పెన్షన్ తీసుకున్నాను, నాకు 2,250 నుంచి ఇప్పుడు 3,000 తీసుకుంటున్నాను. నా పెద్ద కొడుకు నా జగన్ బాబు ఒకటో తారీఖు తెల్లారేసరికి వలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, గతంలో పెన్షన్లు ఎప్పుడిస్తారో తెలిసేది కాదు. జగన్ బాబు నాకు ఇంటి స్ధలం ఇచ్చారు, నేను ఇల్లు కట్టుకుంటున్నా, నాకు సొంత ఇల్లు ఉంది, నాకే భయం లేదు. కరోనా సమయంలో అన్నీ ఇచ్చి ఆదుకున్నారు, ఆరోగ్యశ్రీ లో పాతిక లక్షల వైద్యం చేస్తున్నారు. మీరు మా పెద్ద కొడుకులా మాకు రూ. 3 వేలు ఇస్తున్నారు, నాలాంటి అనేకమంది ముసలివాళ్ళని జగన్‌బాబు ఆదుకుంటున్నారు, నా ఓపిక ఉన్నంతవరకు జగన్‌బాబుకే ఓటేసి గెలిపించుకుంటానన్నారు.
నవరత్నాల పథకాలు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి
కృష్ణవేణి అనే లబ్ధిదారు మాట్లాడుతూ నాకు ఇద్దరు పిల్లలు, మా ఆయన కరోనా సెకండ్ వేవ్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు, ఆయనకు ఆరోగ్యశ్రీలో చికిత్స చేశారు, ఆ తర్వాత నాకు వితంతు ఫించన్ వచ్చింది, నేను ఎలా బతకాలి అనుకునే సమయంలో నాకు ఫించన్ వచ్చి ఆదుకుంది, మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, కరోనా సమయంలో మరణించిన వారికి ఇచ్చే రూ. 50 వేలు కూడా అందాయి, ఆ డబ్బుతో చిన్న షాప్ పెట్టుకుని జీవిస్తున్నాను, నేను వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందాను, సుమారు రూ. 1.70 లక్షలు నేను లబ్ధిపొందాను, మా అత్తగారు కూడా ఫించన్ తీసుకుంటున్నారు, మీ నవరత్నాల పథకాలు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి, మీరు ఆ దేవుడి రూపంలో మాకు సాయం చేస్తున్నారు. మీరే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు