ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య రెడ్డి ఒంగోలులో ఇంటింటికి తిరుగుతూ సమతా నగర్ లో ప్రచారానికి వచ్చారు అయితే ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ చౌదరి తమ ఏరియా లో ప్రచారం చెయ్యకూడదు అని కావ్యను అడ్డుకొని అపార్ట్మెంట్ లోపలికి రాకుండ బయటే తాళం వేసి గొడవ చేసి కావ్యను తిట్టడమే కాకుండా చుట్టూ వున్నవారి మీద దాడులు చేశారు. గతంలో కూడా 2019లో కమ్మవారి పాలెంలో వైసీపీ ఎలక్షన్ ఆఫీస్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఓపెన్ చెయ్యబోతే మా కమ్మపాలెం కు రావద్దు అని 8 గంటల పాటు రోడ్డు మీద బైఠాయించి అడ్డుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ వారు, బాబు సామాజిక వర్గ నాయకులు దాడులు చేసి బీభత్సం సృష్టించారు. ఆరోజు చంద్రబాబు నాయుడి అండతో పోలీసులు కూడా టీడీపీ వారికి అండగా వైసీపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేశారు.
ఆ సంఘటన మరవక ముందే మళ్ళీ ఇప్పుడు మా సామాజికవర్గానికి చెందిన ఏరియా లో ప్రచారం చెయ్యవద్దు అని లోకల్ టీడీపీ నాయకులు మానుకొండ మోహన్ రావు, చెన్నుపాటి వేణుగోపాల్ చౌదరిలు తమ కార్యకర్తలలో అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య రెడ్డి పై అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా చుట్టు ఉన్న వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ఇంతటితో ఆగకుండా దెబ్బలు తిన్న వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే అక్కడికి వచ్చిన టీడీపీ అభ్యర్థి దామరచర్ల జనార్ధన్ గొడవలను మళ్ళీ రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దామచర్ల జనర్ధన్ ది మొదటి నుండి ఇలాంటి స్వభావమే గొడవలు పెడుతూ దాడులు చేపిస్తాడు. చంద్రబాబు సామాజిక వర్గ అండతో ఎక్కడిక్కడ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేపించి భయబ్రాంతులకు గురిచేస్తాడు. బాలినేనిశ్రీనివాసరెడ్డి ఈ సంఘటన మీద స్పందిస్తూ నా జోలికి వచ్చిన మిమ్మల్ని ఏమి అనలేదు వదిలేసాను కానీ ఈరోజు నా కుటుంబం జోలికి వచ్చారు మహిళల మీద దాడి చేసారు ఇలాంటి వాటిని ఒంగోలు ప్రజలు సహించరు వారే బుద్ది చెబుతారు అని మాట్లాడారు.
చూస్తుంటే ఓటమి భయంతో ఈసారి ఎలా అయిన గెలవాలి అనే పంతంతో దామరచర్ల జనార్ధన్ ఇంకా ఎన్ని గొడవలు చేసి ప్రశాంతమైన ఒంగోలులో ఇంకా ఎన్ని గొడవలు సృష్టిస్తాడో అని ఒంగోలు ప్రజలు భయపడుతున్నారు.