సార్వత్రిక ఎన్నికలు మొదలవ్వగానే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన జేబు సంస్థ ద్వారా తన నమ్మినబంటు నిమ్మగడ్డ ద్వారా ఎలక్షన్ కమీషన్ కు వాలంటీర్ వ్యవస్థ మీద ఫిర్యాదులు చేపించి ఈరోజు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వాలంటీర్లు తమ ఇంటికి ఫించన్ పంపిణీ చేసే విధానాన్ని అపించారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరీ ముఖ్యంగా వృద్ధులు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు మీద తిరగబడి శాపనార్ధాలు పెడుతున్నారు. ఎలక్షన్ ప్రచారం కు వచ్చిన టీడీపీ అభ్యర్థులను తిట్టి, తరుముతున్నరు. ఈరోజు ఎలక్షన్ ప్రచారం చేస్తున్న పార్థసారథిని ఒక ముసలవ్వ ఎదురు తిరిగి ఎందుకు ఫించన్లు వాలంటీర్ల ద్వారా వద్దు అన్నారు గొడవ పడే సరికి మహిళ కార్యకర్తలతో గెంటేపించారు నియోజకవర్గ అభ్యర్థి అయిన పార్థసారథి.
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గత 55 నెలలుగా తమ ఇంటికే కోడి కుయ్యకముందే వాలంటీర్ వచ్చి ఫించాన్ ఇచ్చిపోతుండే. ఇప్పుడు టీడీపీ, చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకంతో ఇంటికీ వచ్చి ఫించన్ ఇచ్చే వాలంటీర్ రాకుండ ఊర్లోని గ్రామ సచివాలయలకు ఈ ఫించన్దారులే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడూ అదే వృద్ధులకు కోపం తెప్పిస్తుంది బాబు హయాంలో జన్మభూమి కమిటీ పేరుతో వేధించారు, ఫించన్ కోసం రోజుల తరబడి అఫీస్ చుట్టూ తిరిగాము. కొంత మంది టీడీపీ నాయకులు తమ ఇళ్ళలో పనులు , పశువుల పేడ తీస్తేనే ఫించన్లు ఇస్తాము అని ఏడిపించారు
అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అనీ వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది, ఆరోజు నుండి వాలంటిర్లే ఫించన్లు తీసుకొని నెలలో మొదటి రోజు కోడికుయ్యక ముందే తెచ్చి మాకు ఇంటి దగ్గరే అందిస్తున్నారు అలాంటి దానిని చంద్రబాబు నాయుడు అతని తాబేదార్లు కలిసి అపివేయించారు . మళ్ళీ మమ్మలని రోడ్ల మీదకు తెచ్చారు అని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మండి పడుతున్నారు. టీడీపీ నాయకులు ఎలక్షన్ ప్రచారం కు వస్తే ఎదురు తిరుగుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓట్లు కనీసం 10% కూడా కూటమికి పడవు అని తెలుస్తోంది. దీనితో టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు చేసిన ఈ పని వలన లేనిపోని తలనొప్పులు వచ్చాయి అని ఇటూ పార్టీ పెద్దలకు చెప్పలేక అటూ ప్రచారంలో వృద్ధులు ఎదురు తిరుగుతుంటే జవాబులు ఇవ్వలేక చేసిన దారుణం ను సర్దిచెప్పుకొలేక నలిగిపోతున్నారు.