దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయన మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చిన సమయంలో వారితో ఫోటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ ఈరోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడ్డటం జూనియర్ అభిమానులకి ఆగ్రహం తెప్పిస్తుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను డెకరేషన్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ అని మళ్ళీ కొంతమంది క్రెడిట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు అంటూ పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ పై విరుచుకు పడుతున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం ఓడిపోవడంతో ఆ ఏడు ఎన్టీఆర్ జయంతికి డెకరేషన్ చేయకుండా వదిలివేయడంతో జూనియరే స్వయంగా వచ్చి డెకరేట్ చేయడం ఆనాడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే నాడు ఈ ఉదంతంతో లోకేష్, చంద్రబాబు, భువనేశ్వరీ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ పై తీవ్ర విమర్శలు రావడంతో జూనియర్ పై అక్కస్సు పెంచుకున్న లోకేష్ టీం నాటి నుండి ఆయనను ఏదొక రూపంలో టార్గెట్ చేస్తూనే వస్తుంది అంటున్నారు తారక్ అభిమానులు. ఈ ఏడాది ఎన్టీఆర్ 28వ వర్దంతి సందర్భంగా ఘాట్ వద్ద జూనియర్ అభిమానులు ఆయన పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవడం , బాలకృష్ణ వచ్చి ఆ ఫ్లెక్సీని చూసి ఆయన మనుషులతో తీసిపారయ్ అని చెప్పడం అన్ని మీడియాలో రావడం అందరం చూసామని హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లతో అంటిముట్టనట్టు నారావారి డైరెక్షన్లో అందరూ ప్రవర్తిస్తున్నారని , ఇప్పుడూ ఏకంగా లోకేష్ ఐటీడీపీ చేత టార్గెట్ చేయిస్తున్నాడని, త్వరలోనే వీళ్లందరికి బుద్ది చెబుతాం అంటూ సోషల్ మీడియాలో తారక్ అభిమానులు పోస్టులతో విరుచుకుపడుతున్నారు.