వెన్ను పోటు పొడవటం లో కూడా చంద్రబాబు దొంగ దెబ్బ తీసే విధానమే ప్రత్యేకం. ఎన్ టీ ఆర్ కొడుకుల్ని, కూతుళ్ళను, ఇతర కుటుంబ సభ్యుల్ని ఆయనకు కాకుండా చేసి ఒంటరి వాడిని చేసి గెలిచాడు. వాళ్లందరినీ తన వైపుకి తిప్పుకుని, లక్ష్మీ పార్వతిని బూచిగా చూపి,వారందరి కొంపలూ మునగబోతున్నాయన్న భయాన్ని కలిగించాడు. వాళ్లలో వాళ్ళకే విభేదాలు సృష్టించి ఒక్కొక్కరినీ ఒక్కోరకంగా మిగతా వారికి దూరం చేయడంలో సఫలుడయ్యాడు.
ఎన్ టీ ఆర్ మరణించిన తర్వాత, ఆయన కుటుంబ సభ్యులతో బాబుకి ఇక పెద్దగా అవసరం లేక పోయింది.ఈ విషయం గ్రహించిన దగ్గుబాటి ఎన్ టీ ఆర్ మరణం తర్వాత లక్ష్మీ పార్వతి వైపు ఉన్నాడు. హరికృష్ణ ఎన్ టీ ఆర్ మరణం మీద విచారణ జరపాలని కోరడంతో చంద్రబాబు గుండెల్లో రాయి పడింది. ఎటు తిరిగి అది తన నెత్తికి చుట్టుకుంటుందని భయపడి, మంత్రివర్గ కాబినెట్ ఒప్పుకోలేదని వంక పెట్టి నిరాకరించాడు. అందుకు కోపగించిన హరికృష్ణ రాజీనామా చేశాడు. ఇలా ఒక్కొక్కరుగా ఎన్ టీ ఆర్ కుటుంబ సభ్యులు చద్రబాబు కుట్రను గ్రహించడంతో ఒక్కొక్కరుగా ఆయనకు దూరంగా ఉండటం మొదలు పెట్టారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చంద్రన్న.
అందుకే ఎన్ టి ఆర్ జాతీయ అవార్డు అక్కినేని నాగేశ్వర రావుకి ప్రదానం చేసినపుడు, ఆ సభలో ఎన్ టి ఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ, ఆయన భార్య తప్ప కుటుంబ సభ్యులెవరూ కానరాక పోవడం చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ ఎన్ టీ ఆర్ కుమార్తె భువనేశ్వరి గానీ, స్వయంగా నటుడు అయిన కుమారుడు హరికృష్ణ గానీ హాజరు కాలేదు
కుట్రలు కుతంత్రాలతో కొన్నాళ్ళు ఆట సాగించవచ్చు గానీ, ఏదో ఒక నాడు అవి బయట పడక మానవు. అసలు నిజాలు అందరూ గ్రహించకా మానరు.