రెడ్ బుక్ పేరుతో సాక్షులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్న లోకేష్ కి ఏసీబీ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాల దర్యాప్తులో భాగంగా న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నాని వారిని భయపెట్టే ప్రయత్నం లోకేష్ చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు అనుమతినివ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది.
తాజాగా ఈ పిటిషన్ విచారణకు రావడంతో లోకేష్ ఉద్దేశ్య పూర్వకంగా సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుకు స్పందించడం లేదన్న విషయాన్ని సిఐడి కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించినా వారికి లోకేష్ అందుబాటులోకి రాలేదని, రెండుసార్లు ఆయన నివాసానికి వెళ్లినా అధికారులను కలిసేందుకు లోకేష్ ఇష్టపడని విషయాన్ని సిఐడి ప్రస్తావించింది. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపామని ఆ నోటీసులను తీసుకునేందుకు కూడా లోకేశ్ నిరాకరించారని సీఐడీ వెళ్ళడించింది.
చివరకు లోకేష్ కు వాట్సాప్ ద్వారా నోటీసులను పంపించినా కూడా స్పందించలేదని, ఉద్దేశ్యపూర్వకంగా నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని, సిఐడి ఏసీబీ కోర్టుకు తెలపడంతో లోకేష్ పై ఏసీబీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అధికారులు స్వయంగా లోకేష్ కు నోటీసులు అందించాలని ఆదేశించింది. దీంతో న్యాయస్థానం జారీ చేస్తున్న నోటీసులను తీసుకునేందుకు సుముఖంగా లేని లోకేష్ కు షాక్ తగిలినట్లైంది. నోటీసులు అందుకున్న అనంతరం లోకేష్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.