చంద్రబాబు నాయుడు అవినీతి అనకొండ అనే విషయం అందరికీ తెలుసు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనపై విచారణ కూడా జరగనివ్వలేదు. ఆయన పాపం పండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంఖారావం సభలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ విషయంపై మాట్లాడారు. జగన్ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ అంట. బాబును అరెస్టు చేస్తే పార్టీ కార్యకర్తలు భయపడతారని అనుకున్నారు. కేసులకు భయపడేది లేదని జగన్ గుర్తుంచుకోవాలి. బాంబులకే భయపడని కుటుంబం మాది. పనికిమాలిన కేసులకు భయపడతామా? అవినీతిపై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తున్నా అన్నారు. జనం అన్ని మర్చిపోయి ఉంటారు. ఏం మాట్లాడినా నష్టం లేదని లోకేశ్ అనుకుంటున్నారు.
అసలు బాబుపై ఎన్ని కేసులున్నాయో ఆయన కుమారుడికి తెలియంది కాదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఇందులో గతేడాది చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 50 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. తొలుత అనారోగ్య కారణాలను సాకుగా చూపించి హైకోర్టు నుంచి మధ్యంత బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఈ కేసులో నారా వారు అరెస్ట్ కాగానే లోకేశ్ పాదయాత్రను ఆపేసి ఢిల్లీలో మకాం వేశారు. భారతీయ జనతా పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రూ.కోట్లు ఫీజు తీసుకునే లాయర్లతో మంతనాలు జరిపి రంగంలోకి దింపారు. ఈ కేసు సమయంలోనే వివిధ తెలుగు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో పెయిడ్ ఉద్యమాలు నడిపించారు. భయపడకుండానే ఇదంతా చేశారా లోకేశూ.. చివరికి అనారోగ్య కారణాలను సాకుగా చూపించి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా బాబు అండ్ కోపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉంది. అమరావతి ముసుగులో జరిగిన కుంభకోణం ఇది. ఇందులో బాబు ఏ-1. అలాగే ఇసుక కుంభకోణం. మరొకటి మద్యం కేసు. ఫైబర్ నెట్ స్కామ్. వీటిల్లో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సంగతి మర్చిపోయావా చినబాబూ. అవినీతి కేసులను ఎదుర్కోలేక ఢిల్లీ పెద్దల కాళ్లపై పడేందుకు సిద్ధపడిన మీరు బాంబులకే భయపడలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
కేసులకు భయపడే కదా ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు ఈడీ, సీబీఐ మీ చేతుల్లో ఉన్నాయని ఆటలాడుతున్నారా అని ప్రధాని మోదీ, అమిత్‌షాను తిట్టిన నోటితోనే నేడు పొగడాల్సి వస్తోంది. జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపి జైలుకు పంపిన చరిత్ర మీది. ఆయన ధైర్యంగా కేసుల్ని ఎదుర్కొంటున్నారు. మీలా దొడ్డిదారి వెతుక్కోలేదు. బాబు బెయిల్‌పై బయటకు వచ్చాడు కదా అని మేం ధైర్యవంతులం అంటే ఎలా లోకేశూ.. మీ తండ్రి విజనరీనే.. అది అభివృద్ధిలో కాదు. అవినీతి చేయడంలో.. ఈ విషయం ప్రజలకు బాగా తెలుసు. అందుకే 19లో 23 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడేమో సభల్లో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారు. ఎంత సేపటికీ నారా వారు హైదరాబాద్ కట్టారు. కంప్యూటర్ తెచ్చారని చెప్తారు గానీ.. అసలు అవినీతి చేయలేదని ఏనాడైనా అన్నారా..