టిడిపి జనసేన బీజీపీ కూటమి ఖరారైన నేపథ్యంలో సీట్ల పంపకాలకు సంబంధించి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో కూటమిలో పొత్తులపై చర్చించేందుకు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీజీపీ తరుపున కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ , బిజెపి కేంద్ర ఉపాధ్యక్షుడు జయంతి పాండా హాజరయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆహ్వానం అందలేదు. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ చర్చల్లో బీజీపీ 8 పార్లమెంట్ 8 అసెంబ్లీ సీట్లకు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఏ ఏ సీట్లు బిజెపికి ఇవ్వాలని దానిపై జరుగుతున్న కీలక చర్చలు జరగబోతున్నాయి.
బీజీపీ పోటీ చేసే పార్లమెంట్ స్థానాల్లో అన్ని కులాలు ఉండేలా కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం. మైనార్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీజీపీకి అవకాశం ఇవ్వాలని బీజీపీ ప్రతిపాదనలు పెట్టింది. బీజీపీ రాష్ట్ర కీలక నేతలైన రాజ్యసభ ఎంపీ జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చిన బిజెపి ప్రతినిధులు. సోము వీర్రాజు విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకొని గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ మాదిరే ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం, దానికి బీజీపీ నో చెప్పినట్లు సమాచారం.
గుంటూరు తూర్పు విజయవాడ వెస్ట్ కడప శ్రీకాళహస్తి కదిరి నియోజవర్గాలలో పోటీ చేయాలని బీజీపీ భావిస్తుండగా. . విజయవాడ వెస్ట్ పై జనసేన పట్టు బడుతుందట . బిజెపి అనకాపల్లి పార్లమెంట్ పరిశీలనలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు, రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి సోము వీర్రాజుకి, హిందూపూర్ పార్లమెంట్ లేదా కదిరి అసెంబ్లీ స్థానం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తుంది. ఇంకా పలు అసెంబ్లీ స్థానాలపై సందిగ్ధత వీడలేదు. .ఈ చర్చలు తదనంతరం సాయంత్రానికి జాబితాని బిజెపి పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు సమాచారం .