ఓటమి భయంతో టీడీపీ తప్పు మీద తప్పు చేస్తుంది. వాలంటరీవ్యవస్థను చూసి భయపడుతుంది. 58 నెలలుగా పింఛన్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు తీసుకెళుతున్న వాలంటీర్లను చూసి ఈ రెండు నెలల్లోనే ఎందుకింత అభద్రతాభావానికి లోనవుతుందో భయపడుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల దగ్గర పడే కొద్ది టిడిపి నాయకత్వంలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఆ భయంతోనే వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలని గతంలో చంద్రబాబు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డతో కోర్టులో పిటిషన్ వేయించింది. దాని ఫలితంగా వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలి అని కోర్టులు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే గత నెలలో వాలంటీర్లు విధులకు దూరంగా ఉండటం వల్ల పెన్షన్ల విషయంలో జరిగిన జాప్యం, పెన్షన్ దారులు పడిన ఇబ్బందులు టిడిపిని ఎంత దారుణంగా వ్యతిరేకించాయో మనం చూసాం.. పెన్షన్ కోసం సచివాలయాలు చుట్టూ తిరగలేక వికలాంగులు, వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ఎండలో నిలబడలేక, ఆఫీసుల చుట్టూ తిరగలేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను చూసాం.
అయితే ఇప్పుడు రేపు ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ ఉండగా ఏపీలో పింఛన్లు, రేషన్ సరుకుల పంపిణీ లో వాలంటీర్లు పాల్గొనరాదని చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన, ఇంకా ఆత్మబంధువు అనే ప్రచారం ఉన్న నిమ్మగడ్డ రమేష్ మరోసారి వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేవలం వైయస్ జగన్ మీద అక్కస్సుతో ఆయన తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థను ఎన్నికల సమీపిస్తున్న వేళ నిర్వీర్యం చేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది టీడీపీ. అందులో భాగంగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పెన్షన్ సకాలంలో అందకుండా అడ్డుపడుతూ కక్ష కట్టింది. అయితే ఊహించని పరిణామాలతో పెన్షన్ దారులతో పాటు, ఇప్పుడు నిత్యావసరాలు అందుకునే అందరూ టిడిపి పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.