విశాఖపట్నంను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పర్యాటకుల కోసం కొత్త ప్రాజెక్టును చేపట్టింది. అదే సముద్రంలో తేలియాడే (ఫ్లోటింగ్) బ్రిడ్జి. ప్లాస్టిక్ బ్లాకులతో తీరం నుంచి సముద్రంలోకి కొంత దూరం వరకు బ్రిడ్జి నిర్మిస్తారు. అలలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి పైకి.. కిందికి లేస్తుంది. నడిచే వారికి వింత అనుభూతిని కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటి ప్రాజెక్టు. ఎంతో పేరుగా ఆర్కే బీచ్‌లో ఈ బ్రిడ్జిని కట్టారు.
నాలుగు సంవత్సరాలుగా విశాఖ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ హబ్‌గా మారుతోంది. కొత్త పరిశ్రమలు, హోటళ్లు ఏర్పాటవుతున్నాయి. అంతేగాక పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారికి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి సరికొత్త ఆకర్షణ కానుంది. దీనిపై నడుచుకుంటూ.. సముద్రంలో వంద అడుగుల దూరం వరకు వెళ్లి.. అక్కడున్న వ్యూపాయింట్ నుంచి సాగర అందాలను మరింతగా ఆస్వాదించొచ్చు. ఇప్పటికే రెండు వారాల నుంచి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో పదిరోజుల్లో అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఇది వినియోగంలోకి వస్తే మాత్రం విశాఖ పర్యాటకానికి స్పెషల్ టూరిజం ఎట్రాక్షన్‌గా నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.