ప్రేమెంతా పని చేసే నారాయణ.. ఇదేదో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో హిట్ సాంగ్ పల్లవి కాదు.. టీడీపీ మీద అపార ప్రేమను ఒలకబోస్తూ పొంగూరు నారాయణ ఎన్నికల ఫండ్ కోసం వడ్డీలకు అప్పులు తీసుకుంటూ టీడీపీకి ప్రేమతో అందిస్తున్న చిరు కానుక.. ఈ తతంగానికి నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల వేదికగా మారడం మరో విశేషం..
నారాయణకు చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎన్నికలు జరిగిన ప్రతీసారి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఫండ్ గా నారాయణ విద్యా సంస్థల నుండి పెద్ద మొత్తంలో నగదు సమకూరుస్తారని ఆరోపణలున్నాయి.. అందుకు ప్రతిగా చంద్రబాబు 2014 లో ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో అప్పట్లో చర్చ నడిచింది.
తాజాగా మరోసారి నారాయణ టీడీపీ ఎన్నికల ఫండ్ కోసం నారాయణ, నెల్లూరు వడ్డీ వ్యాపారులను, మార్వాడీలను సంప్రదించి అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించి నగదు తీసుకున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి నారాయణ వైద్య కళాశాల కేంద్రంగా మారడం గమనార్హం. రూ.5 వడ్డీకి నాలుగు రోజుల్లోనే సుమారు 650 కోట్లను వసూలు చేసి ఆ నగదును రహస్య ప్రాంతానికి తరలించారనే వార్తలు రావడంతో ఈ సంఘటనపై అధికారులు దృష్టి సారించారు. నగదును సేకరించినట్లు ఆధారాలు ఉండకుండా ఎలాంటి రసీదులు ఇవ్వలేదని సమాచారం. రసీదుకు బదులుగా టోకెన్లు ఇచ్చి ఈ తతంగం ముగించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా ఉనికి కోల్పోతున్న టీడీపీని ఎలాగైనా గెలిపించుకోవాలని ఓటర్లకు డబ్బు ఆశ చూపించి గాలం వేయాలన్నదే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా కనబడుతుంది.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నారాయణ ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సేకరించేందుకు వీలుగా పావులు కదుపుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగురుంది. ఏది ఏమైనా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన నారాయణ తన స్వలాభం కోసం విద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. పైగా నారాయణ కళాశాలల్లో డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు.