నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. కూటమి కుంపట్ల నేపథ్యంలో అత్తులు పొత్తులు లేని కార్యకర్తలు నేతల రగడల మధ్య, కూటమి సీట్ల కేటాయింపుల్లో కష్టపడిన నేతలకు ఆశాభంగం కలగడంతో జనసేన పార్టీ అంతిమ దశకు చేరుకోనుంది. అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుంది అధికారం సాధించ బోతుంది అంటూ ఐదు ఏళ్లుగా పబ్బం గడుపుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎప్పటిలాగే చంద్రబాబు ప్రాపకం కోసం ఇన్నాళ్లు కష్టపడిన నేతలను పక్కనపెట్టి బిజెపితో పొత్తు కోసం వెంపర్లాడాడు. ఒత్తు కుదిరిన తర్వాత పొత్తు ధర్మంగా సరాసర సీట్లు తెచ్చుకుంటాడు మాకు అవకాశాలు వస్తాయని ఎదురుచూసిన నేతలకు నిరాశ మిగులుస్తూ కేవలం 21 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు.
ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ జెండా మీద పోటీ చేయాలని ఆశపడిన అనేకమంది నేతలకు మొండిచేయి చూపాడు. 10 సీట్లలో టిడిపి నుంచి వచ్చిన వాళ్లే పోటీ చేస్తుండగా.. మిగిలిన స్థానాల్లో జనసేన పార్టీ కోసం కష్టపడిన నేతల్లో వందలో పదోశాతం కూడా అవకాశాలు దక్కలేదు. ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన మనక్రాంతరెడ్డికి నిరాశ మిగిలింది. అయితే మనుక్రాంత్ రెడ్డి గత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేశారు. అనంతరం ఆరేళ్లుగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్నాళ్లు తన పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుందని జనసేన నుండి టికెట్ వస్తుందని ఎదురుచూసిన మనక్రాంతరెడ్డికి నిరాశన మిగులుస్తూ పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపాడు.
దీంతో ఇంతకాలం పార్టీ కోసం సర్వశక్తులు పనిచేసిన తనకి అన్యాయం జరిగిందని మనస్థాపన చెందిన మనక్రాంతరెడ్డి, జనసేన లోనే కొనసాగితే తన భవిష్యత్తుతో పాటు భావితరాల భవిష్యత్తు కూడా కనుమరుగైపోతుంది అని గ్రహించి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఎన్డీఏ కూటమికి కోలుకోవాలని దెబ్బ తగలడంతో పాటు టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థులు తీవ్ర నిరాశలోకి కూరుకుపోయారు. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సంక్షేమ రథసారధిగా ప్రజలు మన్ననలను పొంది, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ గారి వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే భారీ సంఖ్యలో తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.
ఈసందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద, సిటీ అభ్యర్థి ఖలీల్ తదితరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు గుర్తింపుని ఇచ్చి, అవకాశం కల్పించిన సీఎం జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మరొక రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. మనుక్రాంత్ రెడ్డి నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.