చంద్రబాబుకి పవర్ రావాలని.. తెలుగు తమ్ముళ్ళు, అమరావతి రైతులమని చెప్పుకునేవారూ, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకునే సొంత కులం వారే కాక.. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి. ఆగండాగండి… “అది పవన్‌కళ్యాణ్ మాకు తెలుసు, మాకు తెలుసులే” అంటారేమో కాదు. పవన్‌కళ్యాణ్‌కి చంద్రబాబు సీయం అయితేనే ఎక్కువ తంటా, “ప్రశ్నిస్తున్నా” అని సభలు పెట్టి అటు తిట్టలేక, ఇటు ఊరుకోలేక నానా తంటాలు పడాలి కాబట్టి.
ఆ మరో వ్యక్తే “నారా రోహిత్”. తన తండ్రి రామ్మూర్తి నాయుడిని పిచ్చోడని ముద్ర వేసి నాలుగ్గోడలకు పరిమితం చేసినా… పెదనాన్న అంటే ఈ హీరోకి ఇంకా భయం, భక్తీ కూడానూ. వాళ్ళ నాన్నలా కాకుండా తెలివైనవాడు కాబట్టి… ఇప్పటి నుండే “అన్నయ్య కూడా పెదనాన్నలాగే మొండిఘటం” అంటూ జాకీ స్టేటెంట్లు ఇచ్చి తాను వాళ్ళతో పోటీకి రానని పరోక్షంగా చెప్పేసాడు కూడా.
అయితే, మొదట్లో తన సినిమాలను “ARAN” అనే సంస్థ (NARA ని తిరగేసి పెట్టిన పేరు) ద్వారా తానే ప్రొడ్యూస్ చేసి తీసుకున్న ఇతను, ఆపై చంద్రబాబు పవర్ కోల్పోయాక కాస్త నెమ్మదించాడు. మళ్ళీ ఆంధ్ర లో చంద్రబాబు పవర్లోకి వచ్చాక వరుసగా అయిదేళ్ళలో 17 సినిమాలు చేసాడు. జగన్ అధికారంలోకి వచ్చాక విచిత్రంగా ఒక్క సినిమా కూడా లేదు.
ఏం??? ఎందుకని అంటే… అక్కడే ఉందో తమాషా. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందెవారంతా బినామీ పేర్లతో ప్రొడక్షన్ సంస్థలు పెట్టి, ఖర్చులు గట్టిగా చూపించి, చుట్టేసిన సినిమాలకి ఖర్చులు కోట్లలో చూపించి నల్లధనం గా మార్చి లోకేష్ చేతికి ఇచ్చేవారు. అలా సినీపరిశ్రమని కూడా క్విడ్‌ప్రోకో పద్ధతిలో వాడుకుంది నారా కుటుంబం మాత్రమే. అందుకే మళ్ళీ సినిమాలకై రోహిత్ పెదనాన్న చంద్రబాబు అధికారంలోకి రావాలని అంతే ఆశగా చూసేది.