వ్యూహం సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ పనైపోతుందని చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారు.. రంగులేసుకోని నటించే సినిమాను చూసి రంగులేసుకోకుండానే నటించే మహానుభావుడు చంద్రబాబు భయపడుతున్నాడంటే ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.. అందుకే వ్యూహం సినిమా రిలీజ్ ఆపేందుకు కేసుల మీద కేసులు పెడుతూ విడుదల ఆలస్యమయ్యేలా చేస్తున్నారు.
రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కోర్టుల్లో పదేపదే కేసులు వేసి సినిమా విడుదలను టీడీపీనే అడ్డుకుంటోంది. నిజానికి వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ప్రాంతీయ పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సెన్సార్ బోర్డ్ జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తే కనీసం తెలంగాణలో విడుదల చేయడానికైనా అవకాశం ఇవ్వాలని వ్యూహం సినిమా నిర్మాత హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
టీడీపీ ఇంత భయపడటానికి కారణమేంటో అసలు అర్ధం కావట్లేదు.. ఒక సినిమా.. వారి తలరాతలను మార్చేసి ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుందని భయపడుతున్నారు.. అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదన్న మాట టీడీపీ ఆయుష్షు.. అలా చంకలో ఆంబులెన్స్ పెట్టుకోని చంద్రబాబును, ఆక్సిజన్ పెట్టుకోని బ్రతుకుతున్న టీడీపీని ఎన్నాళ్ళని కాపాడుకుంటారు. అయినా వ్యూహం సినిమాకే భయపడి రిలీజ్ ని ఆపడానికి కోర్టును అడ్డుపెట్టుకుంటుంటే.. ఇక నిజజీవితంలో వైఎస్ జగన్ ను ఎదుర్కునేందుకు ఎంతమంది సహాయం తీసుకుంటారో చూడాలి..