ఎప్పుడూ ఏ సందర్భం లో చూసిన ఎక్కడో ఒక చోట ఇలా అంటుంటాడు తాడేపల్లి ప్యాలస్ లో జగన్ అవి పగలగొట్టాడు, ఇవి పగలగొట్టాడు అని ఇప్పుడు ప్రకంపనలు అంటూ ఉంటాడు , భూకంపం ఒక్కటే అనలేదు . లోకేష్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో హౌస్ బాయ్ గా పనిచేస్తున్నాడో ఏమిటో పాపం
ఓ వైపు జగన్ రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తన పార్టీ అభ్యర్ధులును ప్రకటించుకుంటూ ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేశారు , టీడీపీ మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవర్ని కలుపుకోవాలి, ఎవరికి సీటు ఇవ్వాలని సంధిగ్ధంలో ఉన్నారు . ఓ వైపు ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీతో పొత్తుకు బిజెపి ఒప్పుకోవట్లేదన్న భయం ఓ వైపు, మరో వైపు జనసేన ఎక్కడ ఎన్ని సీట్లు అడుగుతుందో, అక్కడ తన వారికి ఎలా సర్దిచెప్పాలో తెలియక ప్రకంపనలకు గురవుతుంది చంద్రబాబే
మరోవైపు కాంగ్రెస్ ద్వారా వైసీపీ ఓట్లని చీల్చేటానికి ప్రయత్నిస్తూ కుటుంబాల్లో చిచ్చులు పెడుతూ ఇవన్నీ తెలిస్తే కాంగ్రెస్ తో కుట్రలు చేస్తున్నందుకు బిజెపి ఆగ్రహానికి గురవుతామేమోనని భయపడుతుంది కూడా చంద్రబాబే.
నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో అనుక్షణం అభద్రతా భావంతో కుట్రలు, వంచనతో రాజకీయాలు చేసే చంద్రబాబుకే భయం కానీ జగన్ కి కాదని లోకేష్ కి అర్ధం కావట్లేదనుకోవచ్చు . ప్రజలకు ఓటమి తాలుకు భయం ప్రకంపనలు టీడీపీ దగ్గర కనపడుతున్నాయి కానీ వైసీపీ దగ్గర కాదు .