తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్నేడు, రేపు ప్రచారం చేయనున్నారు అని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అక్కడ తెలుగువారు అధికంగా ఉండడంతో వారిని బీజేపీ వైపు తిప్పుకునేందుకు లోకేశ్‌తో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. ఆ కారణం చేత నారా లోకేష్ తో ప్రచారం చేయించుకోవాలని తమిళనాడు బిజెపి నేతలు భావించి ఆ దిశగా ప్రణాళికలు వేశారని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన నేడు, రేపు కోయంబత్తూరులో పర్యటించి సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటారు అని తెలిపారు. కానీ మన రాష్ట్రంలో ఎగరలేని పక్షి తమిళనాడులో ఎగురుతుందా అని.. ఆంధ్రలో నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది, పాదయాత్ర తర్వాత శంఖారావం అంటూ ఎన్నికల ప్రచార సభలు మొదలుపెట్టాడు అవి అతి ఘోరంగా విఫలం అయ్యాయి. గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కనిపించకుండా పోయాడు. చివరకి తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజక వర్గంలో అపార్ట్మెంట్లోలో ఉండే ప్రజలతో కాలక్షేపం చేస్తూ కనిపించేవాడు. అలాంటి నారా లోకేష్ తో తమిళనాడులో ప్రచారం అంటే సాహసం అనే చెప్పాలి