ఓసోస్ దావోస్ మనకెందుకు అంటూ చంద్రబాబులా పెట్టుబదుల కోసం జగన్ దావోస్ వెళ్లలేదంటూ కధనాలు .
నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020 , 2021 లో కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిన స్థితిలో దావోస్ వెళ్ళని మాట నిజమే. . 2022 లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధర్వ్యం లో జరిగిన దావోస్ సదస్సు కు జగన్ వెళ్ళాడు , ఆ సదస్సు లో 1 .25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
పోయిన ఏడాది మార్చి 2023 లో విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్(GIS )కు దేశ విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు రిలయన్స్ ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిందాల్, భంగర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎంరావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతారెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్‌రెడ్డి, మషాహిరో యమాగుచి, ‘టెస్లా’ మార్టిన్ ఎబర్‌హార్డ్ తదితర కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు.
వైజాగ్ లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా దాదాపు 13.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులుకు సంబంధించి 386 MOU లు చేసుకొని 6 లక్షల మందికి ఉపాధి చేకూరేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు కి పోలికేన. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో
జరిగిన ఒప్పందాలలో కొన్ని కంపనీలు ఆల్రెడీ తమ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతోంది. పోయిన ఏడాదే విశాఖ సమ్మిట్ లో పారిశ్రామిక వేత్తలు వచ్చి 13 లక్షల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదు .
చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సందర్భంలో – గతంలో ఆయన దావోస్ పర్యటనలు, చెప్పిన మాటలు, వచ్చిన ఫలితాలు చూద్దాం.
2015 జనవరి 20 – 4 రోజుల దావోస్ పర్యటనలో స్పెయిన్ బుల్లెట్ రైలు పై అద్యయనం చేస్తున్నామని ఇంక పెట్టుబడుల వెల్లువలా ప్రవహిస్తాయని చెప్పారు బాబు . కానీ ఫలితం సూన్యం
2016 జనవరి 20 – 4 రోజుల దావోస్ పర్యటనలో మళ్ళీ అదే విదేశి పెట్టుబడుల వరద కబుర్లు చెప్పారు కానీ బురద కూడా రాలేదు
2017 జనవరి 16 – దావోస్ పర్యటనలో
చెప్పిన మాట – విశాఖలో మాస్టర్ కారిడార్ టెక్నాలజి, ఇహ పెట్టుబదుల వరద కానీ ఈ సారి కూడా పెట్టుబదుల వరద పారలేదు.
2018 జనవరి 23 – 4 రోజుల దావోస్ పర్యటనలో
కృష్ణ పట్నం లో భారీ రిఫైనరి, ఆంధ్రాకు ఆలీబాబా కంపెనీ రాక అంటూ ప్రకటనలు గుప్పించారు కానీ ఆలీబాబా రాలేదు. కనీసం అరవై దొంగలు కూడా రాలేదు.
2019 జనవరిలో తాను దావోస్ వెళ్లకుండా తనయుడు లోకేష్ ని పంపిన బాబు తర్వాత ప్రెస్ మీట్ లో దావోస్ కి ఎవరు వెళ్తారు, దావోస్ నే ఇక్కడికి రప్పిస్తా, ప్రపంచాన్ని అనుసంధానం చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు, అటు దావోస్ వెళ్లిన లోకేష్ కి మోడీ మీ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకొంటున్నారని చెమటలు పట్టే రహస్యాలు చెప్పారు విదేశీ ప్రతినిధులు అని ఆంధ్రజ్యోతి కధనాలు రాసింది కానీ పెట్టుబదుల వరద పారించడంలో లోకేష్ కూడా విఫలమయ్యాడు.
నాడు వరసగా అయిదేళ్లు పదుల కోట్ల ఖర్చుతో దావోస్ పర్యటనలు చేసినా కోటి రూపాయల పెట్టుబడి కూడా రాని వైనం గురించి ఒక్క అక్షరం కూడా రాయకుండా ఆహో ఓహో అని భజన చేసిన ఈనాడు ఇప్పుడు దావోస్ కి జగన్ వెళ్ళలేదు పెట్టుబదుల పట్ల ఆసక్తి లేదు అని కధనాలు రాయడం కడు విచిత్రం .