నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న భువనేశ్వరి గారి హామీలు వింటున్న వారికి హాస్యాస్పదంగా ఉన్నాయి. పొరబాటున ఆవిడ చేతిలో టీడీపీ వారు 2014 మేనిఫెస్టో పేపరు పెట్టి పంపించేసారా అన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి.
2014 లో టీడీపీ చేసిన హామీల్లో భాగమైన గిరిజనులకు రోడ్లు, పాఠశాలలు, మెరుగైన వైద్యం కోసం హెల్త్ క్లినిక్ వంటివి ఉన్నాయి. అయితే… తమకు అలవాటే అన్న చందాన నారా వారు అధికారంలోకి రాగానే, మేనిఫెస్టో హామీలకు తిలోదకాలిచ్చి, హెల్త్ క్లినిక్కులు కాదు కదా.. కనీసం ఆ గిరిజన తండాలకు కూడా వెళ్ళలేదు.
ఇప్పుడు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో జగన్ విలేజి క్లినిక్కులనీ, ఫ్యామిలీ డాక్టర్లనీ రకరకాల సదుపాయాలు అందుబాటులోకి తెచ్చి, మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సదుపాయాలు మెరుగు పరిచేసాక… ఇప్పుడు కొత్తగా భువనేశ్వరి గారు మళ్ళీ మొదటికి వచ్చి హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తామనే మాయమాటలు మొదలుపెట్టారు. వీళ్ళకు అన్నీ ఎన్నికల సమయానికే గుర్తొస్తాయి అన్న చందాన… అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి, హెల్త్ క్లినిక్‌ల గురించి ఇప్పుడు మళ్ళీ మభ్యపెట్టి ఓట్లు దండుకుని వెళ్ళేందుకు ప్రజల ముందుకు వచ్చారు.
పోనీ… అరే ఇవి మనం 2014లో పేదల కోసం ఇచ్చిన హామీలు కదా, మన ప్రభుత్వం ఎందుకు అందివ్వ లేకపోయింది అని, చంద్రబాబుని అడిగి నిలదీసేంత విశాల హృదయం ఎటూ లేదాయే. కానీ, ఇప్పటికే ఉన్న ప్రభుత్వం చేసిన పనులన్నీ మళ్ళీ చేస్తాం, మనమే మొదలు పెట్టాం అంటూ అసత్య ప్రచారాల కోసం ముందుంటున్నారు. గతంలో కూడా ఇలానే, వరద బాధితులు కోసం సహాయం అంటూ, యన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బయలుదేరిన కారులు ఒక రెండు గంటలు సిటీలోనే చక్కర్లు కొట్టి మళ్ళీ తిరిగి సాయంత్రం కల్లా యన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కే చేరాయి. అలా ఉంటుంది మరి బాబుతో పెట్టుకుంటే!!