నిజం గెలవాలి అంటూ, బాబు జైల్ లో ఉన్నప్పుడు ఆ వార్త తట్టుకోలేక మరణించిన వారికి తలా మూడు లక్షలు ఇస్తా అంటూ, బాబు జైల్ లో ఉండగా ఓ నలుగురి ఇంటికి వెళ్లిన భువనేశ్వరి, వారికి తలో మూడు లక్షలు ఇచ్చారు, బాబు జైల్ నుండి బయటకు రాగానే ఆ గెలివాల్సిన నిజం గురించి మర్చిపోయి, చనిపోయారు అన్న వాళ్లని మర్చిపోయి హైదరాబాద్ లో ఉంటే ఇదేం విడ్డూరం అని వచ్చిన విమర్శల కారణంగా మళ్లీ నిజం గెలవాలి అంటూ అప్పుడప్పుడు టీవీలలో కనపడుతున్న నారా భువనేశ్వరి వింత వింత స్టేట్మెంట్ లు, ప్రకటనలు ఇస్తున్నారు.. మొన్నామధ్య బాబు గారిని రెస్ట్ తీసుకోమంటా, నేనే కుప్పం నుండి పోటీ చేస్తా అన్నారు… ఇప్పుడు జగన్ సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు అని అంటున్నారు…
ముందు ఎల్లో మీడియాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చింది అని ఏ ఆధారం లేకుండా ఓ గాలి వార్తను వారే వండి వారే దానిపై డిబేట్ లు పెట్టేసి అదే నిజం అని నమ్మించ ప్రయత్నించారు. అలాంటి తాకట్టు ఏం పెట్టలేదని రాష్ట్రప్రభుత్వం ఫాక్ట్ చెక్ ద్వారా వివరణ ఇచ్చింది. తర్వతా ఏ బ్యాంక్ లో అయితే తాకట్టు పెట్టారని ప్రచారం చేసారో సదరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోలేదని పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇక చేసేదేం లేక ఎల్లో మీడియా, బాబు అండ్ కో కూడా సైలెంట్ అవ్వగా, ఇప్పుడు కొత్తగా నారా భువనేశ్వరి ఏపీ సచివాలయాన్ని జగన్ తాకట్టు పెట్టారని అనడం వింతగా ఉంది. అబద్ధం అని ప్రజలకి తెలియకుండా అబద్ధం ఆడితే అదో లెక్క, కానీ అది అది అబద్ధం అని అందరికీ తెలిసాక కూడా అదే అబద్ధాన్ని ఆడటం నారా వారికే చెల్లింది…
నిజం గెలవాలి అంటూ ఎప్పుడు అబద్దాన్ని మాత్రమే నమ్ముకున్న వారు యాత్రలు చేయడం ఏమిటో? చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పడం ఏమిటో…