చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నపుడు ఆయన సతీమణి “నిజం గెలవాలి” పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో గుండెలాగిపోయిన 153 అభిమానుల కుటుంబాలని పరామర్శించి, ఒక్కొక్కరికీ మూడు లక్షల చొప్పున పరిహారం అందించాలనే ఉద్దేశంతో యాత్ర మొదలయింది. మొదలైన మూడురోజులకి, ముగ్గురు అభిమానులు కుటుంబాలని కలిసి మూడేసి లక్షలు ఇచ్చాక, బాబుకి బెయిలు దొరికి విడుదల అయ్యారు. అంతే, భువనేశ్వరి గారి యాత్ర హైదరాబాదుకు మళ్ళింది.
అక్కడ బాబు గారితో పూజలూ, హోమాలు, ఆయన కంటికి ఆపరేషన్ చేసుకోవడంతో సపర్యలు చేయడంలో నిమగ్నమైపోయారు. అసలు యూజ్ అండ్ త్రో పద్దతిలో చంద్రబాబుని మించిన వారు ఉండరంటారు, అటువంటిది ఆయనకి ధీటుగా భువనేశ్వరి గారు చంద్రబాబు జైల్లో ఉన్న రోజుల్లో చనిపోయిన వారిని “బాబు అభిమానుల” ఖాతాలో వేసి పరామర్శ అనే రాజకీయ నాటకానికి తెరలేపారు. ఇలా బాబు బయటఖొచ్చారో లేదో ఆ రాత్రిని అటకెక్కించారు.
అంటే, బాబుకి బెయిలు వస్తేనే నిజం గెలిచేసినట్టా? మిగతా నూటయాభై మంది మరణాలకి, వారి పరామర్శలకి నీళ్ళొదిలేసి, నిజం అనేది బాబుగారితోనే బయటకొచ్చింది అన్ని చందాన, చేసిన వాగ్దానాన్ని విస్మరించారు. అసలు ఏ నిజం గెలవాలో చెప్పలేదు, చంద్రబాబు అవినీతి చేసారో లేదో చెప్పలేదు, ఆ సమయంలో ఇక్కడుండాల్సిన లోకేష్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. వాళ్ళూ వీళ్ళూ రాసిన ఉపన్యాసాన్ని కాసేపు చదివితే… ఆ మాత్రానికే అదే పెద్ద ఉద్యమ స్ఫూర్తి అనే రేంజిలో తోక పత్రికలు జాకీలు వేసాయి. బాబు గారు బయటకొచ్చి కూడా నెల దాటింది. ఇపుడు నూతన సంవత్సరం సందర్భంగా మళ్ళీ భువనేశ్వరి గారు “53 రోజులు పోరాడిన తెలుగు జాతికి అభినందనలు” అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుటుంబానికి అవసరానికి వాడుకోవడం అలవాటనే మాటలు బయటకే వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హఠాత్తుగా జనవరి మూడు నుంచి ఆరు వరకూ మళ్ళీ నిజం గెలవాలి యాత్ర జరుగబోనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సారి అయినా భువనేశ్వరి గారు, నిజం కోసం మాత్రమే యాత్ర చేస్తారో, బాధితుల కుటుంబాలకి ఊరటనిస్తారో లేదా ఎప్పటిలానే రెండ్రోజులు మీడియాలో టకటకలాడించి, నిజాన్ని చుట్టేస్తారో వారికే తెలియాలి!!!.