కొణిదెల నాగబాబు.. సిటీ నటుడు చిరంజీవికి తమ్ముడు. పవన్ కళ్యాణ్‌కు అన్న. ఈయనకు వయసైతే బాగా పెరిగింది. కానీ పెద్దరికం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఫక్తు బజారు మనిషని సినీ పరిశ్రమలో టాక్ ఉంది. రాజకీయాల్లో హుందాతనం చాలా ముఖ్యం. కానీ బాబులో దానిని ఏనాడో అధఃపాతానికి తొక్కేశాడంటారు. ఎల్లో గ్యాంగ్‌తో స్నేహం ఎఫెక్ట్ కారణంగా బుర్ర నిండా మట్టి పేరుకునిపోయిందని, నాగబాబు అణువణువూ విషం నిండిన కలిగిన వ్యక్తి అని చెబుతుంటారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు పదునైన రాయితో దాడి చేయించాడు. దేవుడు, ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయంలో మెగా బ్రదర్ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఆయన మాటల్ని చూసిన జనం తల్లిదండ్రులు, చిరంజీవి ఇంత దారుణంగా పెంచారేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎంపై దాడి జరినప్పుడు ‘చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్.. అసలు స్ట్రిప్టెడ్లా అనిపించడం లేదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై విమర్శలు రావడంతో డిలీట్ చేశాడు. జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ మరో పోస్టు పెట్టి అందరినీ శాంతింపజేసే ప్రయత్నం చేశాడు.
కానీ నాగబాబులోని ఇందుకు పశుతత్వం ఒప్పులేదు. జగన్ సింపతీ డ్రామా ఆడుతున్నాడని వీడియో చేశాడు. ‘జగన్‌రెడ్డి మీద గులకరాయితో పాశవికంగా దాడి చేసిన దుండగుడి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ దుర్మార్గుడిని తప్పకుండా బంధించి గన్‌తో కాల్చి ఉరి తీసి కాళ్లు విరగ్గొట్టి బాగా తన్ని 75 సంవత్సరాలు జీవితఖైదు విధించడం మా కర్తవ్యం’ అంటూ రాసుకొచ్చాడు. దీనిని వ్యంగ్యంగా రాశాడులే అని అందరూ భావిస్తారని నాగబాబు అనుకున్నాడు. కానీ అతను ఏ స్థాయికి దిగజారిపోయాడని మరోసారి ప్రపంచానికి తెలిసింది.
గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఎందుకూ పనికిరారని వీడియోలు, ఇంటర్వ్యూల్లో తిట్టిపోసి నేడు వారి చంకనెక్కి తిరుగుతున్న ఈ మెగా బ్రదర్ పచ్చి అవకాశావాది. రాజకీయ వ్యభిచారి. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానని బిల్డప్ ఇచ్చి అటు జనసైనికుల నుంచి భారీగా వసూళ్లు చేశాడు. సీఎం రమేష్ నుంచి రూ.10 కోట్లు తీసుకుని హైదరాబాద్‌కు చెక్కేశాడు. సందర్భమంటూ లేకుండానే ఫోన్‌పే, గూగుల్ పే నంబర్లు ఇచ్చి పార్టీకి ఫండ్ తీసుకుని విదేశాల్లో జల్సాలు చేసే ఇతను నోటికి అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడుతున్నాడు. సినిమా అవకాశాల పేరుతో యువతుల జీవితాలను నాశనం చేసిన వారికి అండగా ఉన్న వ్యక్తిగా, డబ్బు కోసం గడ్డి తినే రకంగా సినీ వర్గాల్లో ప్రచారముంది.
సేనాని.. నన్ను చంపడానికి హైదరాబాద్‌లో నా ఇంటి ముందు రెక్కీ చేశారని గతంలో గగ్గోలు పెట్టాడు. తీరా అది తాగుబోతుల గొడవని తేలింది. వందల కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి నన్ను చంపాలని చూస్తున్నారని మైక్ చిక్కినప్పుడల్లా అరిచాడు. అందతా కట్టు కథని బయటపడింది. తాజాగా ఎన్నికల సమయంలో బ్లేడ్లతో కోయాలని చూస్తున్నారని ఆరోపించాడు. ప్రచారంలో షీల్డ్‌లు అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. నాగబాబూ.. ఇవీ సింపతీ డ్రామాలంటే. ‘ఉగాది పచ్చడి కోసం పబ్‌కు వెళ్లే సంస్కారవంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం’ అంటూ ఓ పవన్ అభిమానే బాబు పోస్టు మీద కామెంట్ చేశాడు. అతను ఇంకా లోతుగా వెళ్లి ఉంటే తల ఎక్కడ పెట్టుకుంటావ్ స్నేక్ బాబూ..