మెగా బ్రదర్స్ సినీ పరిశ్రమల్లో పెద్దవారే కావొచ్చు. కానీ రాజకీయాలకు వచ్చే సరికి డబ్బే పరమావధిగా ముందుకెళ్తున్నారు. వీరి దిగజారుడు వ్యవహారాన్ని చూసి అటు సొంత అభిమానులు, ఇటు తెలుగు తమ్ముళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో బ్రదర్స్ చాలా పెద్ద దుకాణం తెరిచారు. ప్రత్యక్షంగా మద్దతు కావాలంటే ఒక రేటు, పరోక్షంగా మద్దతు కావాలంటే ఒక రేటు కట్టి నగదు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. నమ్ముకున్న వారికి అసెంబ్లీ, ఎంపీ ఇప్పించలేకపోయినా అభిమానులను చూపించి రూ.కోట్లు దండుకుంటున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ప్రచారానికి రావాలన్నా గంటకు ఇంత అమౌంట్ అని తీసుకున్నారని సీనియర్ నేతలే వాపోయిన సందర్భాలున్నాయి. జనసేన పార్టీ వచ్చాక మళ్లీ పాత సంస్కృతికి శ్రీకారం చుట్టారని పొలిటికల్ సర్కిల్లో చెవులు కొరుక్కుంటున్నారు. 2024 ఎన్నికల నేపథ్యంలో మెగా బ్రదర్స్ తమ రాజకీయ కాల్షీట్లను ఎక్కువ రేటుకే అమ్ముకుంటున్నారట. చిరంజీవి అయితే నేరుగా వచ్చి ప్రచారం చేయలేనని చెబుతున్నారని తెలిసింది. తనను కలిస్తే ఆల్ ది బెస్ట్ చెబుతానని, దీనిని సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టుకుని తన అభిమానుల నుంచి లబ్ధి పొందొచ్చని అంటున్నారట. ఇందుకు గానూ ఆయన రూ.3 కోట్ల పైన తీసుకుంటున్నట్లు కూటమిలోని నేతల్లో చర్చ జరుగుతోంది.
ఇక జనసేన ఓనర్ పవన్ కళ్యాణ్ వంతు. ఈయన కాల్షీట్ల ధర తక్కువేం లేదు. నేరుగా వచ్చి ప్రచారం చేసేందుకు రూ.2 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. సేన అభ్యర్థులేతే కొంచెం తగ్గించి తీసుకుంటున్నారని, టీడీపీ, బీజేపీ అభ్యర్థులైతే ముక్కుపిండి డబ్బు లాగేస్తున్నారని సమాచారం. దీనికితోడు హెలికాప్టర్, సెక్యూరిటీ, ఫుడ్, తనతో వచ్చే వారి అవసరాలు, సభలకు విచ్చేసే అభిమానులకు మందు, డబ్బు సంగతి కూడా చూసుకోవాలనే కండీషన్ ఉంది. అదే కార్యాలయంలో ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో మద్దతు పోస్టులు పెట్టుకునేందుకు రూ.కోటి డిమాండ్ చేస్తున్నారట. చంద్రబాబు ప్రత్యేకంగా ప్యాకేజీ ఇస్తున్నారు కాబట్టి ఆయనతో సభల్లో పాల్గొంటే తక్కువ మొత్తం తీసుకుంటున్నట్లు ఎల్లో గ్యాంగ్ అంటోంది. కూటమి అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్ చిరును కలిసేందుకు రూ.3 కోట్లు ఇచ్చారని, సభకు రావడానికి పవన్‌కు రూ.2 కోట్లు ఇచ్చారని, ఆయన అభిమానులకు మరో రూ.2 కోట్లు ఖర్చయినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
నాగబాబు విషయానికొస్తే అనకాపల్లి టికెట్ వదులుకోవడానికి సీఎం రమేష్ నుంచి రూ.10 కోట్లు తీసుకున్నాడని ఇప్పటికే ప్రచారం ఉంది. ఈయన ఫెల్యూర్ స్టార్ కావడంతో ఎవరూ ప్రచారానికి పిలవడం లేదని తెలిసింది. తనకు రూ.25 లక్షలు ఇచ్చి, ఆరోజు ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుందని చెప్పినా జనసేన అభ్యర్థులే నో చెబుతున్నారట. ఇక టీడీపీ అభ్యర్థులు దగ్గరకు కూడా రానివ్వడం లేదు. తన కుమారుడు వరుణ్‌తేజ్ కూడా హీరోనని, రూ.50 లక్షలు ఇస్తే వచ్చి ప్రచారం చేస్తాడని బతిమిలాడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధలో ఉన్నాడట. అందువల్ల పార్టీ కార్యాలయంలోనే ఎక్కువగా ఉంటున్నాడు. పవన్ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి నాయకులతో మాట్లాడడమే ప్రస్తుతం చేస్తున్న పని. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కు కొంత డిమాండ్ ఉన్నా వారి సినీ భవిష్యత్ దృష్ట్యా చిరంజీవి దూరం పెట్టినట్లు తెలిసింది. మొత్తానికి ఎన్నికల కారణంగా మెగా బ్రదర్స్ వందల కోట్ల రూపాయలు కూడగడుతున్నారు.