జన సేన పార్టీలో టికెట్ ల మీద పవన్ కళ్యాణ్‌దే ఫైనల్ నిర్ణయమని దానికి ఎవరు అడ్డుచెప్పినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నాగబాబు నోట్ విడుదల చేశారు.
ఒకప్పుడు జన సేనలో నేను తప్పు చేసినా నన్ను నిలదియ్యండి, నన్ను చొక్కా పట్టుకొని అడగండి అంటూ కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు తన పార్టీ నుండీ ఎమ్మెల్యే అభ్యర్ధులుగా బాబు కోసం బాబుకు నచ్చిన నాయకులకు టికెట్ లు ఇచ్చి గత పది సంవత్సరాలుగా పార్టీకి కష్టించి పనిచేసిన నాయకులను గాలికి వదిలేశారు.
పవన్ కళ్యాణ్ గతంలో వారాహి అనే పేరుతో గోదావరి జిల్లాల్లో కొంత మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు, అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకులకు పోటి చేసే అవకాశం ఇస్తాము అని అలాగే ప్రత్యర్ధి పార్టీలలో నీ నాయకులకు టికెట్ ఆశా చూపించి జాయిన్ చేసుకొని తీరా ఎలక్షన్స్ వచ్చే సరికి ఏ ఒక్కరికి టిక్కెట్లు ఇవ్వలేదు. దీనితో ఇప్పుడు ఆ నాయకులు తమకు జరిగిన అన్యాయం మీద మాట్లాడుతుంటే తాము ఎక్కడ పార్టీ నాయకులకు చేసిన మోసం బయట పడుతుందో అని భయపడుతున్నారు. దానితో పార్టీ కి వ్యతిరేఖంగా ఎవరు మాట్లాడిన క్రమ శిక్షణ చర్యలు అంటూ కబుర్లు చెబుతున్నారు.
కానీ ఇప్పటికే జన సేనలో మోసపోయిన నాయకులు జన సేన పార్టీ మాటలను పట్టించుకునే స్థితిలో లేరు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే కనీసం పవన్ కళ్యాణ్ మాతో మాట్లాడటం లేదు టికెట్ దేనికి ఇవ్వలేదో చెప్పలేదు లేదూ పార్టీ టికెట్ ఇవ్వలేను భవిష్యత్ లో మంచి చేస్తాను అని కూడా భరోసా ఇవ్వడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదుని కోపంతో వున్నారు జన సైనికులు . అగ్నికి ఆజ్యం పోసినట్టు పార్టీ క్రమశిక్షణ చర్యలు అనే పేరుతో నాగబాబు పార్టీ నాయకులను రెచ్చగొట్టడంతో ఈ గొడవలు ఏ తీరంకు చేరుతాయో సేనాని నావని ముంచుతాయో చూడాలి,