గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ కు సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో భగ్గు మంటున్నాయి. ముద్రగడ పద్మనాభం వలన కాపులు తనకు దూరం అవుతున్నారు అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ముద్రగడ మీద వ్యక్తిగత విమర్శలతో పాటు ముద్రగడ కుటుంబాన్ని ప్రజల మధ్యకు తీసుకువచ్చి, ముద్రగడ పరువును తగ్గించేలా చేస్తున్నారు. ముద్రగడ కూతురు గాయత్రీ భర్త తనకు అభిమాని కావడంతో అతని సహకారంతో గాయత్రీ తో తన తండ్రీకి వ్యతిరేకంగా ఒక వీడియో విడుదల చేపించి ముద్రగడను మానసికంగా ఇబ్బందులు పెట్టారు.
దీని మీద ముద్రగడ మాట్లాడుతూ మా అమ్మాయి ఇప్పుడు వేరే వారి ఇంటి కోడలు, ఆ ఇంటి కోడలు కాబట్టి వారికి నచ్చినట్టు మాట్లాడింది, దయచేసి కుటుంబాన్ని చిల్చకండి అంటూ వేడుకున్నారు. అయినా పవన్ కళ్యాణ్ వెంటనే తన తుని సభకు గాయత్రిని తీసుకువచ్చి ఈమె ముద్రగడ పద్మనాభం కూతురు ఈమెకు భవిష్యత్తులో నేను టికెట్ ఇస్తా , అలాగే తండ్రీ కూతుళ్లను కలుపుతా అంటూ పవన్ కళ్యాణ్ సెలవిచ్చారు.
దీని మీద ముద్రగడ పద్మనాభం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ గాయత్రీ ఇప్పుడు మా ఇంటి మనిషి కాదు తన ఇంటి పేరు కూడా వేరు ఆ ఇంటి పేరుతో తన భర్త లేదా ఆ ఇంటి పెద్ద వాళ్ళ మామ పేరు పెట్టీ పరిచయం చెయ్యాలి గానీ నా ఇంటి పేరుతో ఎలా చేస్తావు అంటూ మండి పడ్డారు. ఇలా చెయ్యాలి అంటే ముందు నీ ముగ్గురి భార్యలను అలానే వేల మంది సమక్షంలో పరిచయం చెయ్యి . అలా చేసేటట్లు అయితేనే వేరే వారి కుటుంబ విషయాలను పబ్లిక్ లో మాట్లాడు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు .అంతే కాకుండా నీ అభిమానుల చేత ముద్రగడ పద్మనాభం అమర్ రహే, ముద్రగడ పద్మనాభంకు జోహార్లు అంటూ అనిపిస్తున్నావు . ఎందుకు అలా దిగజారి నీలో వున్న ఆక్రోశాన్ని బయట పెట్టుకుంటావు అంటూ మాట్లాడారు. నేను మొదట మీ గురించి ఏనాడు మాట్లాడింది లేదు మీరే వారాహీ యాత్రా అని వచ్చి నా మీద చులకనగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పటికి కూడా నేను మీ గురించి మాట్లాడలేదు. ఆ తరువాత మీరు టీడీపీతో కలిసి కనీసం ఓ నలభై స్థానాలు, సీఎం పదవిలో షేరింగ్ లేకుండా 24 సీట్లు మాత్రమే తీసుకుంటున్న అన్న రోజు మాత్రమే మీ నిర్ణయాన్ని తప్పుబట్టాను అని గుర్తు చేశారు.
జరిగిన సంఘటనలు గమనిస్తే నేను కాపు నాయకుడిగా చంద్రబాబు కాపులకు చేసిన అన్యాయం ను ప్రశ్నిస్తుండే సరికి చంద్రబాబు ఇబ్బంది పడటం చూడలేని మీరు చంద్రబాబు కోసం నా మీద నా కుటుంబం మీద కక్ష కట్టి మా పరువును తీస్తున్నారు అని మీడియా ముఖంగా వెల్లడించారు.