ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయాలు వేడెక్కుతున్న వేళ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం పరిపాటి. అయితే అవి వాస్తవికతను ప్రతిబింబిస్తే ఖచ్చితంగా ప్రత్యేకమే… ఈ కోవలోనే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు ఒక ప్రత్యేకతని సంతరించుకుంటూ వస్తున్నాయి. కాపు ఉద్యమ నేతగా పేరు ఉన్న ముద్రగడ, ఆ సామాజిక వర్గంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ముద్రగడ తన సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఈ విమర్శలు కచ్చితంగా ప్రత్యేకంగానే కనపడుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ గతంలో పవన్ కు ఎవరికీ జరగని రీతిలో హైదరాబాద్లో ఘోరాతిఘోరమైన అవమానం జరిగింది. నిజంగా అలాంటి అవమానం ఎవరికి జరిగిన ఆ స్థానంలో ఏ సామాన్యుడు ఉన్న ఖచ్చితంగా అవతల వ్యక్తి కాలర్ పట్టుకుని నిలదీస్తారు. రోషం పౌరుషం కలిగిన ఏ ఒక్కడైనా సరే చేసే పని అదే… కానీ మాట్లాడితే పౌరుషాలు, రోషాల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఏమాత్రం అవమానభారం లేకుండా తనను అవమానించిన వ్యక్తిని పల్లెత్తు మాట కూడా అనకుండా అతని ఇంటికి వెళ్లి సిగ్గు లేకుండా టిఫిన్ చేసి వచ్చాడు అని ఎద్దేవా చేశారు. కారణం లేకుండా కేవలం చంద్రబాబు ప్రాపకం కోసం సీఎంను తిట్టడంలో పవన్ చూపించిన కోపం, పౌరుషం, ఆవేశం అవన్నీ తనను ఎంత ఘోరంగా అవమానించినవారి విషయంలో ఏమైపోయాయి అని సూటిగా ప్రశ్నించారు.
అయితే ముద్రగడ చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంసంగా మారాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు కారణాలు గతంలో పవన్ కళ్యాణ్ పరిటాల రవి ఇంటికి వెళ్లి పరోటాలు తిని రావటమే అని ఉన్న ప్రచారం నిజమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సభా వేదిక మీద మాట్లాడుతూ తనకు గుండు గీసి ఊరేగించింది పరిటాల రవి అని టిడిపి వాళ్ళే ప్రచారం చేశారు అని ఊగిపోయిన సంగతిని జనం గుర్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అని మాట్లాడుకుంటున్నారు. అసలు కారణాలు ఏవైనా తనను అంత తీవ్రంగా అవమానించిన వ్యక్తి దగ్గరికి వెళ్లి టిఫిన్ చేసి రావటం అనేది పవన్ కళ్యాణ్ చేతకానితనం అనుకోవాలో లేక అతనికి రోషం పౌరుషం అనే లక్షణాలు కాస్త కూడా లేవు అనుకోవాలో తెలియని స్థితిలో జనసేనకులు మదనపడుతున్నారు.