‘సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్. ఆయనకు నా అభినందనలు’ పశ్చిమ గోదావరి జిల్లా తణులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. పవన్ పొలిటికల్ కాల్షీట్ల కంటే సినిమా కాల్షీట్లే ఎక్కువగా ఇచ్చాడు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అతడితో ఉన్న అవసరాల నేపథ్యంలో బాబు పై మాటలు చెప్పారని అర్థమవుతోంది.
బాబు అన్నట్లుగా పవన్ ఏనాడూ సినిమా జీవితాన్ని.. అక్కడి సుఖాలను వదల్లేదు. వీకెండ్ పొలిటీషియన్‌గా ఉన్నాడు. ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు గానీ.. అతనికి సినిమాలు చేయడం.. వాటి ద్వారా కోట్ల రూపాయలు వెనుకేసుకోవడమే ఇష్టం. ప్రజారాజ్యం సమయంలోనే జల్సా విడుదలైంది. ఆ పార్టీ 2009 ఎన్నికల్లో ఓడిపోయాక ప్రజా క్షేత్రం నుంచి వెళ్లిపోయాడు. 10లో కొమరం పులి రిలీజైంది. 11లో పంజా, తీన్మార్, 12లో గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, 13లో అత్తారింటికి దారేది సినిమాలు వచ్చాయి.
ప్రశ్నిస్తానంటూ 2014లో జనసేనను పెట్టిన పవన్ ఇక ప్రజా సేవకే జీవితం అంకితం చేస్తానన్నాడు. తనకు సినిమాలు సెట్ కావని అభిమానుల ముందు డబ్బా కొట్టుకున్నాడు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించకుండా హ్యాపీగా సినిమాలు చేసుకున్నాడు. అటు నిర్మాతల నుంచి ఇటు టీడీపీ అధినేత నుంచి భారీ మొత్తాలే అందుకున్నాడు. 15లో గోపాల గోపాల, 16లో సర్దార్ గబ్బర్ సింగ్, 17లో కాటమరాయుడు, 18లో అజ్ఞాతవాసి విడుదలయ్యాయి. 19 ఎన్నికల సమయంలో అయితే సినిమాలు మానేస్తున్నాని మరోసారి చెప్పాడు. కానీ మాట తప్పి మూవీస్‌పై దృష్టి పెట్టేశాడు. అదేమంటే డబ్బు కోసం తప్పడం లేదని ఏమార్చే ప్రయత్నం చేశాడు. 21లో వకీల్‌సాబ్, 22లో భీమ్లానాయక్, 23లో బ్రో సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇప్పుడేమో అప్పుడప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తూ తన ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇంకా హరిహర వీరమల్లు చిత్రీకరణ స్టేజ్‌లో ఉంది. మరోవైపు సురేంద్రరెడ్డి, ఇతర దర్శకులతో సినిమాలకు ఓకే చెప్పాడు సేనాని, మధ్యమధ్యలో కొన్ని మూవీస్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. త్రివిక్రమ్‌తో కలిసి సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు.
రాజకీయాలపై పవన్‌కు సీరియస్‌నెస్ లేదని, ప్రజాసేవపై శ్రద్ధ లేదని, సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని 2019లో జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ వాపోయారు. సేన నుంచి ఆయన బయటకు వచ్చేశారు. ప్రజలను ఉద్ధరిస్తానంటూ 2022 డిసెంబర్లో వారాహి యాత్ర ప్రారంభించాడు పవన్. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానని చెప్పాడు. కానీ హైదరాబాద్ స్టూడియోల్లోనే ఎక్కువ సమయం గడిపాడు. సినిమా కాల్షీట్లు లేని సమయంలో ఓ రెండు రోజులు వచ్చి అలా తిరిగి జగన్‌ను తిట్టి వెళ్లిపోయేవాడు. ఇటీవల కూడా ప్రచారం చేస్తూ ఓసారి జ్వరమంటూ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఉస్తాద్ భగత్‌సింగ్‌కు సంబంధించిన వీడియో విడుదలకు డబ్బింగ్ చేప్పిన ఘనుడు సేనాని. 2019 ఎన్నికలయ్యాక 2023 మధ్య కేవలం 60 సార్లు మాత్రమే విజిటింగ్ పొలిటీషియన్‌గా ఏపీకి వచ్చాడు. ప్రజల కోసం ఏనాడూ నిలబడని వ్యక్తి. ఇన్ని విషయాలు కళ్ల ముందు కనిపిస్తుంటే పవన్ సుఖవంతమైన సినిమా జీవితాన్ని ఎలా వదులుకున్నాడో చంద్రబాబే చెప్పాలి. సేనానిని ప్రజా నాయకుడిగా చిత్రీకరించి ఆయన అభిమానుల మెప్పు పొందాలనేది బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. కానీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.