టీడీపీ సొంత పత్రికలో బీసీ ద్రోహి జగన్ అంటూ అనగాని ప్రసాద్ రాసిన లేఖను ప్రచురిస్తూ, వైసీపీ లో టికెట్ దక్కని ఎమ్మెల్యే ల స్టేట్మెంట్ లు కూడా జతచేసి ఓ వంటకం వండి వదిలారు..
2019 ఎన్నికల్లో జగన్ 175 పార్లమెంట్ స్థానాల్లో 41 సీట్లు బీసీ లకు కేటాయించగా, బీసీ లకోసమే పార్టీ పెట్టాం అని మొదటి నుండీ వారిని ఓటు బ్యాంక్ గా వాడుకున్న టీడీపీ నుండి 31 మంది బీసీ లకే సీట్లు ఇచ్చారు.. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుండి గవర కులానికి చెందిన సత్యవతి, రాజమండ్రి నుండి గౌడ కులానికి చెందిన మార్గాని భరత్, కర్నూలు నుండి చేనేత కులానికి చెందిన సంజీవ్ కుమార్, అనంతపురం నుండి వాల్మీకి బోయ కులానికి చెందిన తలారి రంగయ్య, విజయనగరం నుండి తూర్పు కాపు కులానికి చెందిన బెల్లన చంద్ర శేఖర్ లు వైసీపీ తరపున పార్లమెంట్ కు ఎన్నికయ్యారు…
నామినేటెడ్ పోస్ట్ లలో 50%, కాంట్రాక్టులలో 50% బీసీ, ఎస్సీ , ఎస్టీ లకే ఇవ్వాలని చట్టం చేసి మరీ అమలు చేస్తుంది జగన్ ప్రభుత్వం, దాదాపు 22 ఏళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఏనాడైనా ఇంత సాహసవంతమైన నిర్ణయం తీసుకుని బీసీ లకు న్యాయం చేసిందా?
72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో చట్ట సభల్లో ఏనాడూ ప్రాతినిధ్యం లేని బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సంకల్పించి వారికి సీట్లు కేటాయించింది వైసీపీ, వడ్డెర కులానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఏసురత్నం కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, విజయవాడ అంటే కమ్మ, కాపు, బ్రాహ్మణ కులాల వారే అనే అపోహ పోగొడుతూ “నగర” కులానికి మేయర్ స్థానాన్ని ఇచ్చింది వైసీపీ పార్టీ. టీడీపీ కి కనీసం ఈ నగర అనే కులం ఉందనే అవగాహన అయినా ఉందా? జనరల్ సీట్లలో కూడా బీసీ అభ్యర్థులను నిలిపి పార్లమెంట్ కు పంపిన చరిత్ర వైసీపీ ది. 2024 ఎన్నికల్లో కూడా బీసీ లకు పెద్ద పీట వేస్తూ అగ్రకులాల అభ్యర్థులను కూడా కాదని బీసీలకి సీట్లు కేటాయిస్తుంది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వైసీపీ పక్కాగా గెలిచే స్థానం అయినా నరసరావుపేట ఎంపీ స్థానాన్ని యాదవ కులానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు కేటాయించడం జగన్ కి బిసి ల పట్ల ఉన్న ఇష్టతకు, నిబద్ధతకు నిదర్శనం.
ఇక బాబు విషయానికి వస్తే ఆయనకు బీసీ ల పట్ల ప్రేమ ఎట్టిదో 2014 ఎన్నికల మేనిఫెస్టో చూస్తేనే తెలుస్తుంది.. కులానికో అరడజను చొప్పున వాగ్దానాలు చేసిన బాబు, బీసీలకు కూడా వందల హామీలు ఇచ్చి గెలిచాక ఎలా చేతులెత్తేశాడో, మేనిఫెస్టోనే ఎత్తేశాడో అందరికీ తెలుసు..
ప్రభుత్వ స్థలాల్లో ఉన్న మైనర్ ఫల సంపదను ముదిరాజ్ లకు కేటాయించడం, మైనర్ ఫల సంపదను పెంచడానికి ప్రభుత్వ స్థలాలను వారికివ్వడం…
ఇచ్చాడా?
వడ్డెర సొసైటీలకు క్వారీలను లీజుకు అప్పగింత,
సబ్సిడీ పై జేసీబీ లు, ప్రొక్లెయినర్లు అందించడం,
వడ్డెర సొసైటీ లకు వ్యాట్ పన్ను మినహాయింపు…
చేశాడా?
స్వర్ణకారులకు పోలీస్ వేధింపుల నుండి విముక్తి కల్పించడానికి 1985 పోలీస్ మెమో ను జీవోగా మార్చి అమలు చేయుట,
వారికి పనిముట్లు కొనుగోలు చేయడానికి సబ్సిడీపై లోన్లు అందించుట..
చేశాడా?
సబ్సిడీ పై వెదురు సరఫరా చేస్తాం,
మేదరులను ఎస్సీ జాబితాలో చేర్చుట..
చేశాడా?
మట్టి సేకరించడానికి ఆయా గ్రామాల్లో భూమి కేటాయింపు,
వ్యాపారాలు స్థాపించుకోవడానికి రుణాలు ఇప్పించుట,
చేశాడా?
ఇత్తడి, రాగి వస్తువుల తయారీకి ఆధునిక యంత్రాల సరఫరా..
చేశాడా?
కలప పనిముట్ల తయారీకి ప్రభుత్వ ధరకే కలప సరఫరా,
ఎస్టీ లుగా గుర్తించుట..
గుర్తించాడా?
బీసీ-డీ నుండి బిసి-ఎ గా మార్చుట..
మార్చాడా?
పద్మశాలీలు:
బీసీ-బి నుండి బీసీ – ఎ గా మార్చుట.
ఇలా ప్రతీ కులానికి ఇన్నిన్ని హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చాడా?
ఎన్నికల వరకు బీసీ లు కావాలి, ఎన్నికలు అయిపోయి గెలిచాక బీసీ ల మొహం చూడరు..
బీసీ లు జడ్జ్ లుగా పనికి రారు అని లేఖ రాసిన బాబు బీసీ ద్వేషా? బీసీ లను గుండెలో పెట్టుకుని వారికి గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా వారి వృద్ధికోసం దోహదం చేస్తున్న జగన్ బీసీ ద్రోహా? అయ్యా మా సమస్యలు పట్టించుకోండి, మీరు 2014 లో ఇచ్చిన హామీని నెరవేర్చండి అంటూ మొరపెట్టుకోవడానికి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన నాయీ బ్రాహ్మణుల తోక కట్ చేస్తా అన్నది బాబే కదా? వారు బీసీ లే కదా? బీసీ ద్రోహి బాబా? జగనా? చేతిలో పత్రికలు ఉంటే ఏదైనా రాసుకోవచ్చు.. కానీ అది నమ్మడానికి జనాలు వెర్రోళ్ళు కాదు.. బాబు ఎంత మోసగాడో తన స్వార్థం తప్ప వేరే ఏ కులానికి, వర్గానికి, ఏ పేదవాడికి న్యాయం చేయాలి అనుకునే మనసున్న వాడు కాదని తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే…