జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కీలక స్థానంలో చూడాలని మెగా ఫ్యామిలీ కలలు కంటోంది. ఈసారి ఎలాగైన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని చిరంజీవి అండ్ కో కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన చాలా పనులను మెగా హీరోలు భుజాలకెత్తుకున్నారు. ప్రత్యక్షంగా వస్తే ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చి సినీ కెరీర్‌పై ప్రభావం పడుతుందని భయపడి పరోక్షంగా పవన్‌కు సహకారం అందిస్తున్నారు. అధికారం వస్తే అనుభవించడానికి.. కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎన్నికల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు.
ఎన్నికల ఖర్చుల కోసం చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ సుమారు రూ.100 కోట్లు తన బాబాయ్ పవన్‌కు ఇచ్చాడని అటు సినీ సర్కిల్లో, ఇటు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఇది నిజమయ్యే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. రామ్‌చరణ్ చాలాకాలం నుంచి వివిధ వ్యాపారాల్లో చేస్తున్నాడు. తనకు కావాల్సిన ప్రభుత్వం ఉంటే పనులు సులువుగా చేయించుకోవచ్చనే భావనలో అతను ఉన్నాడు. ఈ నేపథ్యంలో సేన అభ్యర్థుల ఖర్చులకు డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మా కూటమి పవర్లోకి వస్తే మీకోసం ఏమైనా చేస్తానంటూ ఇప్పటికే పవన్ నిర్మాతల నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడు. టీడీపీకి ఇప్పించాడు. అప్పుడప్పుడు అనారోగ్యం పేరుతో హైదరాబాద్‌కు వెళ్లి ఆయన చేసే పని డబ్బు సర్దుకోవడమేనని టాక్ ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి నోట్ల కట్టలు వచ్చి పడుతుండడంతో వాటిని ఎన్నికల్లో కుమ్మరించి గెలిచేయొచ్చని పవన్ భావిస్తున్నాడట. కాగా రామ్‌చరణ్ మాత్రమే కాదని, మిగిలిన మెగా హీరోలు, కుటుంబసభ్యులు జనసేనకు డబ్బు ఇచ్చినట్లు వారి అభిమానులే ప్రచారం చేస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ సేనాని ఇంతకాలం బిల్డప్ ఇచ్చాడు. కానీ అందినకాడికి తీసేసుకుంటున్నాడు. బుధవారం బీ ఫారాలు ఇచ్చిన అనంతరం అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యాడు. ఏ నియోజకవర్గానికి ఎంత ఇస్తామో చెప్పేశారట. కొందరు బాగా సౌండ్ పార్టీ కావడంతో వారిని మినహాయించి మిగిలిన వారికి మెగా ఫండ్ అందుతుందని హామీ ఇచ్చాడని సీనియర్ జనసైనికులు చెబుతున్నారు. తనకు పావలా వాసన తెలియదని చెప్పే పవన్ ఇప్పుడు రూ.కోట్లలోనే డీల్ చేస్తున్నాడు.