సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు సిటీ స్థానాన్ని సామాన్య కుటుంబానికి చెందిన ఎండీ ఖలీల్ అహ్మద్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. ఈయనకు గతంలోనే వైఎస్సార్సీపీ నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించింది. సిటీకి ఇన్చార్జి నియమితులైన తర్వాత ఖలీల్ శనివారం మీడియాతో మాట్లాడారు. సామాన్యుడికి అవకాశం ఇవ్వడం జగనన్నకే సాధ్యమైందన్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింలను తెలుగుదేశం ఓటు బ్యాంక్‌గా వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారన్నారు. టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ వేల కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి. నేను మామూలు వ్యక్తిని. అయినా జగనన్న చరిష్మాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుస్తున్నాం కాబట్టే నమ్మకంగా ఉన్నట్లు చెప్పారు. ముస్లింలకు సీటు కేటాయించడంతో ఆ వర్గం ఎంతో సంతోషంగా ఉంది. నగరంలో టపాసులు కాల్చి సీట్లు పంచుకున్నారు. విద్యాసంస్థల మాఫియా అధిపతికి పోటీగా సామాన్యుడిని నిలబెట్టిన జగన్‌కు సింహపురి ప్రజానీకం జై కొడుతోంది.