ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి ఆర్థిక వనరులు సమకూర్చే భాధ్యత ఈనాడు, మార్గదర్శి అధిపతి రామోజీరావు తన భుజాన వేసుకున్నారు. ఇప్పటికే తన మార్గదర్శి ముసుగులో నిధులను తరలించడం మొదలు పెట్టారు. అలా నిధులు తరలిస్తున్న క్రమంలో వైజాగ్ లో 52 లక్షలతో పాటు 36 లక్షల రూపాయల విలువైన చెక్కలతో మార్గదర్శి ఉద్యోగులు ఎన్నికల అధికారులకు దొరికారు. అధికారులు అ డబ్బులకు గురించీ అడిగితే మార్గదర్శి సంభందించిన డబ్బులు అని చెప్పారు. కానీ వాటి తాలూకు అధికార అధారాలు ఇవ్వండి అని అడగడంతో ఉద్యోగులకు వణుకు పుట్టి అవి మార్గదర్శి డబ్బులు మీరు కావాలంటే మార్గదర్శి పెద్దలు , రామోజీరావుకు చెప్పండి మా డబ్బులు మాత్రం మాకు ఇవ్వండి అంటూ అధికారుల మీద గొడవలు చేసి దాడులు చేసినంత పని చేశారు. అయితే అధికారులు సంయమనంతో మీకు 48 గంటలు సమయం ఇస్తున్నాం అ డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించి మీ డబ్బులు మీరు తీసుకువెళ్ళిండి లేకుంటే పోలీసుల ద్వారా కేసు నమోదు చేసి నిబంధనల ప్రకారం ఐటీ వారికి వీటిని అందచేసి విచారణ జరిపుతాము అని ప్రకటించారు.
ఆ రోజు నుండి ప్రతి రోజూ ఎన్నికల అధికారుల చుట్టూ తిరగడం వాళ్లు ఆధారాలు చూపించి తీసుకెళ్లండి అని జవాబు ఇవ్వడం వాటికి సరైన లెక్కలు లేక అవి మార్గదర్శివి అని చెప్పడానికి సరైన ఆధారాలు లేక మార్గదర్శి, రామోజీరావు కింద మీద పడుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇచ్చిన 48 గంటలు ముగియడంతో ఎన్నికల అదికారులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి మార్గదర్శి ఉద్యోగుల మీద చర్యలకు అదేశాలు ఇచ్చి అ కేసును నిబంధనల ప్రకారం ఐటీ శాఖ కు బదలాయించారు. ఇప్పుడు మార్గదర్శి , రామోజీరావు అ 88 లక్షలకు సరైన ఆధారాలు లెక్కలు ఐటీ శాఖకు చూపించాలి లేని పక్షంలో వీరి మీద కేసులు నమోదు అయ్యి జైలుకు పోయే పరిస్థితులు కనపడతున్నాయి. ఇప్పటివరకు రామోజీరావు, మార్గదర్శి ఉద్యోగులు అ 88 లక్షలకు లెక్కలు చూపించలేక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పొద్దున నుండి సాయంత్రం వరకు వదిలిపెట్టామని కనిపించిన ప్రతి అధికారి చుట్టూ తిరుగుతున్నారు, ఒక రెండు రోజులు భరించిన కలెక్టర్ ఆఫీస్ అధికారులు ఇంకొకసారి ఇక్కడకు రావద్దు అని వార్నింగ్ ఇచ్చి వాటి మీద కేసులు నమోదు చేశారు. ఆ కేసు ఐటీ శాఖకు బదిలీ అయ్యింది మీరు ఏమైన మాట్లాడేది వుంటే అక్కడికి వెళ్లి సరైన ఆధారాలు చూపించి మీ డబ్బులు మీరు తీసుకు వెళ్ళండి అని వార్నింగ్ ఇచ్చారు దీనితో ఏమి పాలుపోని స్థితిలో పడ్డారు రామోజీరావు సంస్థ ఉద్యోగులు . ఆ డబ్బులు టీడీపీవి అని ఒప్పుకోలేరు, వాటికి సరైన లెక్కలు చూపించలేక సతమతమవుతున్నారు. చూస్తుంటే టీడీపీ, మార్గదర్శి చీకటి కోణాలు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.