కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ నాయకుడు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అతని పెన్ డ్రైవ్‌లో మూడు వేల అశ్లీల వీడియోలు ఉన్నాయి. అవి ఆయన లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళల వీడియోలే. రేవణ్ణ దేశం విడిచి జర్మనీ పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. అతనిపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా రేవణ్ణ డర్టీ పిక్చర్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాత్ర ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. రేవణ్ణ మహిళలపై లైంగికదాడి పాల్పడే సమయంలో వీడియో తీసేవాడు. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి తన కోరికలను తీర్చుకునేవాడు. పలు సందర్భాల్లో ఇతనితో లోకేశ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఏపీలోని కుప్పం నియోజకవర్గానికి చెందిన యువతులపై లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. చంద్రబాబుకు జేడీఎస్ నేతలతో సత్సంబంధాలున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పలుమార్లు బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామిని కలిశారు. కుమారస్వామి సీఎం కావడానికి కారణం తానేనని నారా వారు చెప్పుకొనేవారు. ఆ సమయంలోనే లోకేశ్, రేవణ్ణల మధ్య స్నేహం కుదిరినట్లు చెబుతుంటారు. ప్రస్తుతం టీడీపీ, జేడీఎస్‌లు బీజేపీతో స్నేహంలో ఉన్నాయి.
కుప్పం పర్యటన పేరుతో లోకేశ్ నిత్యం బెంగళూరుకు వెళ్లేవారు. ఆ సమయంలోనే రేవణ్ణతో కలిసి మహిళలపై అరాచకాలకు పాల్పడినట్లు కర్ణాటకలో చర్చ నడుస్తోంది. అలాగే అక్రమ మహిళా రవాణాలోనూ చినబాబు హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇద్దరూ వేరే దేశాలకు వెళ్లి స్టార్ హోటళ్లలో బస చేసి మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రేవణ్ణపై ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తునకు 18 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఎన్నికల సమయంలో లోకేశ్ పేరు బయటకు రావడంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. లోకేశ్ ఉన్న వీడియోలు వెలుగులోకి వస్తే టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మాట్లాడి లోకేశ్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని అడిగినట్లు తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. రేవణ్ణను ఏమైనా చేసుకోండని, తన కుమారుడిని మాత్రం వదిలేయాలని కోరారట. పనిలోకి పనిగా తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేత కూడా చెప్పించాడట.
అసాంఘిక కార్యకలాపాలు లోకేశ్‌కు కొత్త కాదు. విదేశాల్లో చదువుకునే సమయంలో తాగి, మహిళలతో అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు పలుమార్లు బయటకు వచ్చాయి. ట్రిప్‌ల పేరుతో అమ్మాయిలతో తిరిగేవాడని టీడీపీ నేతలకు తెలుసు. అలాగే పార్టీలోనూ అనేకమంది ఆడవారిని అతను తన గ్యాంగ్‌తో కలిసి ఇబ్బంది పెడితే వారు బయటకు వచ్చేసి ఏడ్చిన సందర్భాలున్నాయి. రేపు ఏపీలో టీడీపీలో అధికారంలోకి వస్తే మహిళలను అక్రమంగా రవాణా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేసినా అడిగేవారుండని చినబాబు రెచ్చిపోతాడు.