లోకేషే కాదు తెదేపా వ్యవస్థాపకులు యన్టీఆర్ దగ్గర నుంచి, బాబు, బాలకృష్ణ, లోకేష్ వరకూ అందరూ ఇదే మాట చెఫ్తారు. కానీ నలభయ్యేళ్ళ నుంచి బీసీలకు ఇచ్చిన ఎన్ని హామీలు తెదేపా అమలు చేసింది?? ఆ బీసీ హామీల ఊపిరిని పురిట్లోనే ఎన్నిసార్లు చిదిమేసారో చూద్దాం.
చేతి వృత్తికారులకు శిక్షణ, ఆధునిక పరికరాల కల్పన చేపట్టడానికి “ఆదరణ” అనే పధకం ప్రవేశపెట్టిన టీడీపీ ఆ ఆదరణ అనే పధకం ఎంత ఆదరణకు నోచుకుంది? ఆ ఆదరణతో లాభపడ్డ చేతి వృత్తకారులెంతమంది?. టీడీపీ కార్యకర్తలు నలుగురికి ఇచ్చిన నాసిరకం పరికరాలు నాలుగు చూపి బీసీ వర్గాలు మొత్తానికి మేలు చేసినట్టు గొప్పలు పోతారు చంద్రబాబు.
09-07-2012 తేదీన టీడీపీ ప్రకటించిన “బీసీ డిక్లరేషన్” ప్రకారం వెనుకబడిన తరుగతుల వారికి 100 శాసనసభ స్థానాలను కేటాయించాలన్న నిర్ణయం ప్రకారం… అప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తెదేపా బీసీలకు ఇచ్చిన స్థానాలెన్ని? బీసీలకు ఇచ్చిన సముచిత నాయకత్వం ఎక్కడ?
రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణ అభివృధ్ధి, మార్కెటింగ్ పదవులు మొదలగు నామినేటెడ్ పదవుల నియామకాల్లో మూడోవంతు బీసిలకు ఇవ్వాలని తెదెపా ఇచ్చిన హామీలో.. బీసీలకు దక్కిన నామినేటెడ్ పదవులెన్ని? ఆయా కార్పొరేషన్లతో బీసీలకు జరిగిన మంచి ఎంత?. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో 33.1/3 శాతం బీసీలకు ఇస్తామన్న మాటతో… రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్లు అయిన బీసీలెంతమంది?
అత్యంత వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని, కుదిరనప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తానని ప్రగల్భాలు పలికిన బాబు, మరి ఇచ్చిన నామినేటెడ్ పదవులెన్ని? లాభపడ్డ ఆ బీసీలెందరు ?
బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటుకు ఆధార్‌తో సంబంధం లేకుండా చేస్తాం, అద్దె భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళను అద్దె భవనాల నుంచి సొంత భవనాల్లో కి మార్చుతామనీ, పెరిగిన ధరలు సూచీకి అనుగుణంగా హాస్టళ్ళ భోజనం ఖర్చులు, ఉపకార వేతనాలు పెంచుతామన్న బీసీ ప్రేమికుడు బాబు మరి బీసీలకై కట్టించిన సొంత భవనాలు ఎన్ని?
కుల వృత్తులు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేస్తామన్న “వృత్తి సమూహాలు” ఎక్కడ ? చిన్న, మధ్య తరహా వృత్తులకై ఇస్తామన్న సబ్సిడీ లోన్లెక్కడ ?
చేనేత వృత్తి కార్మికుల కోసం అరచేతిలో స్వర్గాన్ని చూపించిన బాబు మరి చేనేత వృత్తుల వారి కోసమై చేస్తానన్న… సహకార సంఘాల అద్దె మినహాయింపు, గుర్తింపుకార్డు జారీ, బ్యాంకు రుణాల మాఫీ, వీవర్స్ వృద్ధాప్య పింఛను పెంపు, తక్కువ వడ్డీకే రుణాలు, మూతపడిన చేనేత సంఘాల పునరుధ్ధరణ మొదలగు హామీల జాడ ఎక్కడ??
అసలు పైన చెప్పిన ఏ హామీని కూడా బాబు 2014లో అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. ప్రతి ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పది హామీలను గుప్పిస్తే…మన వెనక తిరిగే ఓటర్లలానే వెనుకబడిన వర్గాల వారిని టీడీపీ చూసింది తప్ప… నిజంగా ఏనాడు వారిని ఉద్ధరించడానికి, పూర్తిస్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నించలేదు. కానీ బాబు, లోకేష్ మాత్రం నిరంతరం బీసీ జపం చేయకుండా ఏ ఎన్నికలకీ వెళ్ళరు!!