ఇంకా పొత్తు కుదరకముందే తనని తాను కూటమి నుండి నర్సాపురం అభ్యర్థిగా ప్రకటించేసుకున్న రఘురాం కృష్ణ రాజుకు కాదని నర్సాపురం టికెట్ ను శ్రీనివాసవర్మ కు కేటాయించింది బీజేపీ. దెబ్బకి కరెంట్ షాక్ తగిలిన కోతిలా బిక్కచచ్చి ఏం చేయాలో తోయక బాబును బ్లాక్మైల్ చేయగా తన జుట్టు రఘురాం కృష్ణ రాజు చేతిలో పెట్టిన బాబు టీడీపీ తప్పక గెలిచే సీట్ అయిన ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆ రాజుకు కేటాయించాడు. కుప్పంలోనే నమ్మకం లేని గెలుపు ఉండిలో మాత్రం ఉండగా అలాంటి సీటును ఇలాంటి వ్యక్తి చేతిలో పెట్టగా గెలిచే నాలుగులో కూడా ఒకటి ఉచితార్థంగా పోగొట్టునే పరిస్థితి ఏర్పడింది.
అయినా ఉండి స్థానం నుండి తాను గెలవలేనని గ్రహించి మళ్లీ నర్సాపురం ఎంపీ స్థానం కోసం లాబీయింగ్ మొదలు పెట్టిన రఘురాం కృష్ణ రాజుకు బీజేపీ షాక్ ఇచ్చింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణంరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టుకు హఠాత్తుగా సీబీఐ వెల్లడించింది.
ఇండ్ -భారత్ కంపెనీ పేరుతో రఘురామ కృష్ణంరాజు థర్మల్ పవర్ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారు. కంపెనీ కోసం నిధులు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రఘురామ మళ్లీ రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని దారి మళ్లించడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. లాబీయింగ్ ల ద్వారా ఇన్ని రోజులు దాని నుండి ఎలాగోలా తప్పించుకున్న రఘురామ రాజుకు ఇవాళ సుప్రీం కోర్టులో సీబీఐ షాక్ ఇచ్చింది. ఈ హఠాత్పరిణామానికి కారణం నర్సాపురం సీటును తనకు ఇవ్వాలని సదరు ట్రబులార్ పట్టుబట్టడమే అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇంతకన్నా ఎక్కువ చేస్తే నీకు ఏం గతి పట్టబోతుందో గుర్తు చేసుకో అంటూ బీజేపీ ఇచ్చిన వార్నింగ్ లాంటిది ఇదని రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా చర్చ జరుగుతుంది.