నేటితో కృష్ణా జలాల రాకతో కుప్పం సస్యశ్యామలం కానుంది. 2022, సెప్టెంబరు 23న కుప్పం ప్రజలకు మాట ఇచ్చిన సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి కావడంతో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి మద్దికుంటచెరువు , నాగసముద్రం చెరువు,మనేంద్రం చెరువు తొట్లచెరువులకు కృష్ణా జలాలను విడుదల చేసిన అనంతరం 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. దీంతో కుప్పం నియోజకవర్గం కృష్ణా జలాలతో సస్యశ్యామలం కానుంది.
35 సంవత్సరాలుగా గెలిపిస్తున్నా కుప్పం ప్రజలను పట్టించుకోని చంద్రబాబు
గత 35 సంవత్సరాలుగా గెలిపిస్తున్నా, మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ 57 నెలల జగన్ పాలనలో కుప్పం అభివృద్ధిలో దూసుకుపోయింది. కుప్పంకు మునిసిపాలిటీ హోదా కల్పించడంతో పాటు రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ లను ఏర్పాటు చేశారు సీఎం జగన్. రూ.66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా నియోజకవర్గంలోని 4 మండలాల అభివృద్ధికి మరో రూ. 100 కోట్లు మంజూరు చేశారు చేసారు. కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, కుప్పం నియోజకవర్గంలో మరో 2 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసారు.
కుప్పం జలప్రదాయిని పాలారు ప్రాజెక్టులో భాగంగా 0.6 టిఎంసి సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.215 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన జగన్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు తమిళనాడు సర్కారును ఉసిగొల్పి సుప్రీంకోర్టులో కేసులు వేయించారు. బాబు పాలనలో 2014-2019 మధ్య కుప్పం నియోజకవర్గంలో మంజూరైన ఇళ్ల పట్టాలు అక్షరాలా సున్నా.. కానీ జగన్ పాలనలో 2019 -2024 ఫిబ్రవరి 26 వరకు మంజూరైన ఇళ్ల పట్టాలు 14,898 కాగా మరో 15000 ఇళ్ళ పట్టాలు త్వరలో మంజూరు కానున్నాయి. 2014-2019 సంవత్సరాల మధ్య చంద్రబాబు హయాంలో 3547 ఇళ్ళు మంజూరు చేయగా 2968 ఇళ్లను పూర్తి చేశారు. మరోవైపు 57 నెలల జగన్ పాలనలో మంజూరు చేసిన ఇళ్లు 7,898 కాగా పూర్తయిన ఇళ్లు 4,871. అంతేకాకుండా డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా కుప్పం నియోజకవర్గ ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన లబ్ది రూ.1,400 కోట్లు కాగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.1,889 కోట్లను అర్హులైన లబ్దిదారులకు సీఎం జగన్ అందించారు. కుప్పం నియోజకవర్గం నెత్తిన పెట్టుకుని మోస్తున్న బాబు నియోజకవర్గ అభివృద్ధికి 35 ఏళ్లుగా సైంధవుడిగా అడ్డుపడితే 57 నెలల జగన్ పాలనలో పూర్తిస్థాయిలో కోలుకుని అభివృద్ధి బాట పట్టింది.
1989 నుంచి అంటే 35 ఏళ్లుగా కుప్పం MLA 14 ఏళ్ళు సీఎం గ ఉండి కుప్పం అభివృద్ధికి బాబు చేసింది ఏమి లేదు అంటే ఆశ్చర్యం వేయొచ్చు కానీ అదే సత్యం.