తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేశినేని నాని మాట్లాడుతూ అధికార వైఎస్సార్సీపీ పార్టీని 175కు 175 స్థానాలు గెలిపించుకోవాల్సిన అవశక్యత ఎంతైనా ఉందిని , దానికి తగినట్లు మనమంతా కష్టపడాలి అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రస్థాయిలో ఉండే సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయికి తీసుకొని వచ్చి గ్రామంలో ఉండే ప్రజలు ఎక్కడికి వెళ్లే పని లేకుండా వాళ్ళ పనులు అన్ని అక్కడే జరిగేలా మంచి వ్యవస్థను తీసుకొని వచ్చారని అన్నారు. గ్రామ స్థాయిలో వైయస్సార్ విలేజ్ క్లీనిక్ కింద 14 రకాల వైద్యం చేయటం దానికి అవసరమైన 140 రకాల మందులు ఇస్తున్నారని ఇలాంటి వైద్య సేవలు ప్రపంచంలోనే చూడలేదని ఎంపీగా నేను దేశం మొత్తం తిరిగానని ఇలాంటి పరిపాలన జగన్ తప్ప ఎవరూ చేయలేరని కేశినేని కితాబు ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసమే పని చేసే ప్రభుత్వమే జగన్ ప్రభుత్వం అని నాని అన్నారు.
ఇదే సభలో మాట్లాడుతూ 2024 ఎన్నికలు చంద్రబాబుకి , పనికిమాలిని బుద్ధిలేని అతని కొడుకు లోకేష్ కి చివరి ఎన్నికలు అన్నారు. చంద్రబాబుకి అమరావతిలో గాని గుంటూరులో గాని సొంత ఇల్లు ఉందా ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు తన సొంత రాష్ట్రం తెలంగాణకి వెళ్లిపోవటం ఖాయం. కానీ జగన్ మోహన్ రెడ్డి తన సొంత ఇంటిని తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. పేదవాళ్లు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి అని కేశినేని ప్రసంగిచారు.
ఆనాడు ఎన్టీఆర్ పేద , బడుగు బలహీన వర్గాల కోసం టిడిపిని స్థాపిస్తే ఈనాడు చంద్రబాబు టిడిపిని పేదలకు దూరం చేసి కేవలం పెత్తందారులకు ధనవంతులకు స్వార్థపరులకు మాత్రమే చంద్రబాబు లోకేష్ పనిచేస్తున్నారని నాని విమర్శించారు. పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే జగన్ యొక్క ఆశయం అని కేశినేని నాని అన్నారు.