తెలుగుదేశం పార్టీ విధానాలను, తప్పులను విజయవాడ ఎంపీ కేశినాని నాని ఏకిపారేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన గతం కంటే రాజకీయంగా చాలా యాక్టివ్ అయ్యారు. టీడీపీలో తనకు జరిగిన అవమానాలను తలుచుకుని బాధపడకుండా వాటిని జనం ముందు ఉంచుతున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఎలా చూశారో చెబుతున్నారు. తాజాగా ఆయన తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడపలో కట్లేరు బ్రిడ్జి పనులకు ఆదివారం శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు.
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కుండబద్ధలు కొట్టారు. 2024 ఫలితాలు రాగానే తండ్రీకొడుకులు తమ సొంత రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లిపోవడం ఖాయమని చెప్పారు. టీడీపీ ఎల్లో మీడియాపైనే ఆధారపడి ఉందన్నారు. గుడివాడలో చంద్రబాబు సభ పెడితే మూడువేల మంది కూడా రాలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం సభలకు జనం పోటెత్తుతున్నారని వెల్లడించారు. కట్లేరు బ్రిడ్జి కోసం జగన్ రూ.25 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. నాని నిజాలు చెబుతుండటంతో తెలుగు తమ్ముళ్లు నోరు తెరిచేందుకు భయపడుతున్నారు. దీంతో బాబు కేశినాని చిన్ని చేత నానిని తిట్టిస్తున్నారు. వాస్తవానికి చిన్నికి జనంలో పెద్దగా పేరు లేదు. ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకుంటున్న పరిస్థితి లేదు.