మరో రెండు రోజుల్లో ఏపీలో ఎన్నికల సంగ్రామం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జగన్ వేవ్ మరింత బలంగా వీస్తునట్టు ఇప్పటికే పలు సర్వేల ద్వారా వినిపిస్తున్న మాట. జగన్ సైతం వైనాట్ 175 నినాదంతో ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. వైసీపీ శ్రేణులు సైతం గ్రామ గ్రామాన ఇదే నినాదంతో ప్రచారంలో ముందున్నారు. జగన్ ప్రచార స్పీడ్ కి కూటమి పార్టీలు ఇప్పటికే వెనకపడిపోయి డీలా పడిపోయాయి. జగన్ కి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు పెరగడానికి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, పరిపాలనా సంస్కరణలే ముఖ్య కారణమని ఆయన తీసుకున్న ప్రతీ నిర్ణయం నేరుగా గ్రామాల్లో గడపలకే తాకిందని అందుకే ప్రజల్లో జగన్ కి ఈ స్థాయి మద్దతు వస్తుందని కూటమి పార్టీల అంతర్గత సర్వేల్లో వెళ్లడైనట్టు సమాచారం.
ఇదిలా ఉంటే కూటమి పార్టీలకి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో మరో జలక్ తగిలింది. ఒక ప్రముఖ ఛానల్ లో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలపై కూడా కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సదరు ఇంటర్వ్యూలో యాంకర్ ఏపీ రాజకియాలు , జరగబోతున్న ఎన్నికలపై అడిగిన ప్రశ్నకు బదులుగా కేసీఆర్ మళ్ళీ జగనే సీఎం కాబోతున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని తేల్చేశారు. కొద్ది రోజుల కిందట కేటీఆర్ సైతం జగనే మళ్ళీ కాబోయే సీఎం అని చెప్పిన విషయం మరువక ముందే మళ్ళీ కేసీఆర్ సైఅతం అదే తరహాలో కామెంట్ చేయడంతో కూటమి అభ్యర్ధుల గుండెల్లో ఓటమి భయం మరింత పెరిగిపోతుందనే వాదన రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట .