10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేస్తున్న జాతీయ పార్టీ అయిన బీజేపీకాపు సామాజిక వర్గం నుండి కనీసం ఒక్కటంటే ఒక్క సీట్ కేటాయించకపోవడం పై కాపు ఐక్యవేదిక ఖండించింది..
ఒక జాతీయ పార్టీ అయిన భారతీయ జనతాపార్టీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉపకులాలను పూర్తిగా విస్మరించుట జరిగింది అనీ, బి.జె.పి. పోటీచేస్తున్న ఆరు ఎమ్.పి., పది అసెంబ్లీ స్థానాలలో కనీసం ఒక్కటి కూడా కాపులకు కేటాయించలేదని, రాష్ట్రంలో బలమైన కాపు సామాజికవర్గాన్ని పూర్తిగా విస్మరించిన బి.జె.పి.కి కాపులు తగిన గుణపాఠం చెప్పాలని కాపు ఐక్యవేదిక పిలుపు నిచ్చింది. మొత్తం 16 సీట్లలో ఒక ఎమ్.పి., మూడు అసెంబ్లీ స్థానాలను తమ సామాజికవర్గం వారికి ఇప్పించుకోవడంలో బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి, తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు కృతకృత్యులయ్యారు. మొత్తం సీట్లలో నాలుగో వంతు సీట్లు వారి సామాజికవర్గం వారికే ఇప్పించుకొన్నారు. అంతేకాకుండా మిగిలిన 12 స్థానాలలో కూడా వారికి అనుకూలమైన వారికి మాత్రమే టిక్కెట్లు ఇప్పించారు. అని ఈ సందర్భంగా వారు విమర్శించారు…
బి.జె.పి. వారు టిక్కెట్లు ఇవ్వండలో సామాజికన్యాయాన్ని ఏమాత్రం పాటించలేదు. కాపులకు, బి.సి.లకు, బ్రాహ్మణులకు తీరని ద్రోహం చేసారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అంతా బి.సి.లైప్పటికీ అక్కడ కూడా తమ సొంత సామాజికవర్గం వారికే టిక్కెట్టు ఇప్పించుకున్నారు.
అదేవిధంగా జనసేనలో అత్యంతబలమైన బి.సి.నాయకులు శ్రీ పోతిన మహేష్ గారికి వెన్నుపోటు పొడిచి సుజనా చౌదరి గారికి ఆ టిక్కెట్టు లాక్కున్నారు.
విశాఖపట్నం పార్లమెంటు సీటు జి.వి.ఎల్.నరసింహారావు గారికి ఇవ్వకుండా అడ్డుపడి బ్రాహ్మణ సామాజికవర్గానికి తీరని ద్రోహం చేసారు.
కనీసం జి.వి.ఎల్.నరసింహారావు గారికి అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. శ్రీ జి.వి.ఎల్. నరసింహారావు గారు కాపు సామాజికవర్గం వారి సమస్యలపట్ల సానుకూలంగా ఉన్నారనే సాకుతో కాపు బాంధవ్యుడైన వారిని తొక్కేసారు. బి.జె.పి. మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు స్థానికంగా ఉన్నప్పటికీ స్థానికేతరాలైన శ్రీమతి పురందేశ్వరి గారు రాజమండ్రి ఎమ్.పి. అభ్యర్థిగా సీటు దక్కించుకున్నారు. కాపులు అత్యధికంగా ఉన్న రాజమండ్రి రూరల్ సీటైనా సోము వీర్రాజు గారికి ఇవ్వకుండా వారికి పూర్తిగా అన్యాయం చేసారు. బి.జె.పి., టి.డి.పి.కి ‘బి’ టీమ్‌గా మారిపోయింది. వలస నేతలకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లకు అన్యాయం చేయడమే కాకుండా సమన్యాయాన్ని, సామాజికన్యాయాన్ని ఏమాత్రం వారు పాటించలేదు. అని బీజేపీ మరియు చంద్రబాబు పై వారు విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు…
ఈ నేపథ్యంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట పార్లమెంటు నియోజక వర్గాలలో కాపు ఐక్యవేదిక మరియు సోషల్ జస్టిస్ ఫోరమ్‌ల పక్షాన కాపు, తెలగ, బలిజ అభ్యర్థులను పోటీలో పెట్టబోతున్నట్లుగా కాపు ఐక్యవేదిక ప్రకటించింది.
శ్రీమతి పురందేశ్వరి గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సామాజిక అన్యాయాన్ని గౌరవ ప్రధాని మోడీ గార్కి, బి.జె.పి. జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డా గారికి, కేంద్ర హోమ్శాఖామాత్యులు అమిత్ షా గారికి, రాష్ట్ర పరిశీలకులు శివప్రకాష్ గారికి కూడా మెయిల్స్ ద్వారా తెలియజేసినట్లు కాపు ఐక్యవేదిక పక్షాన తెలియజేసామని వెల్లడించారు…
కాపులు కమలం గుర్తుకు ఎందుకు ఓటు వేయకూడదో సవివరంగా తెలియజేస్తూ కరపత్రము ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో తెలియజేస్తామని, అదేవిధంగా సోషల్ జస్టిస్ ఫోరమ్ వేదిక ద్వారా బి.సి.లకు, బ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరిస్తూ కరపత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.