చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ ధ్వజమెత్తారు. గతంలో అనేక సందర్భాల్లో కన్నా లక్ష్మి నారాయణ చంద్రబాబు తీరును విమర్శించారు. గతంలో గుంటూరులోని డి.సి.సి. కార్యాలయంలో జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించిన ఆయన చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రజల శ్రమను ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపా రాలు నిర్వహిస్తున్న అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని, పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న కోట్లాది రూపాయిల నిధులను రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని దుయ్యబట్టారు. చంద్ర బాబునాయుడు అమలుచేస్తున్న పథకాలన్నీ పేదవాడి కడుపు కొట్టి తెలుగు దేశం కార్యకర్తల జేబులు నింపుతున్నాయని, ఐఆర్డిపి.పథకం నిధులు, బి.సి., ఎస్.సి. కార్పొరేషన్ నిధులు దారి మళ్ళించి సీఎంఈవై పథకాన్ని అమలుచేస్తున్నారని పేర్కొన్నారు.
తెలుగు దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వలన రాష్ట్రంలో ప్రత్తి రైతుల ఆత్మహత్యలు క్రికెట్ స్కోరులాగా పెరిగి పోతున్నాయని, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంఘటిత పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఆస్తులు ఉన్నాయని, చంద్రబాబు తెచ్చిన అప్పులకు ఆస్తులు లేవని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని కంట్రోలర్ అండ్ జనరల్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారని రానున్నది ఎన్నికల సమయమని, ఈ సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
గతంలో కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. చంద్రబాబు తీరు అప్పటికీ ఇప్పటికీ పెద్ద మారలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త మోసపు హామీలిచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.