ఏపీలో కూటమి పొత్తు రోజురోజుకీ టీడీపీ, జనసేన, బిజెపి మధ్య కార్చిచ్చులా రగులుతూనే ఉంది. ఏలూరు జిల్లా కైకలూరుని పొత్తులో భాగంగా బిజెపి కి కేటాయించారు. ఇక్కడ అభ్యర్ధిగా చంద్రబాబు నాయుడు నమ్మిన బంటు మాజీ మంత్రి అయిన కామినేని శ్రీనివాస్ కేటాయించారు. ఇప్పుడు అదే కూటమి లో చిచ్చు రాజేసింది. జన సేన తరుపున 2019 లో పోటి చేసిన బీవీరావు మరొకసారి కైకలూరులో పోటీ చెయ్యడానికి సన్నాహాలు చేసుకున్న సమయంలో కూటమి ఏర్పడి కైకలూరులో బిజెపి పోటి అని ప్రకటించారు. అందులో 2019 తరువాత నియోజకవర్గం ను పట్టించుకోని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నా అని ప్రకటించిన కామినేని శ్రీనివాస్ ను అభ్యర్ధిగా ప్రకటించడంతో బీవిరావు మండిపడుతున్నారు.
2019 తరువాత నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి జనసేన పార్టీని బలోపేతం చేస్తే చివరకు తనకు ఏ మాత్రం సమాచారం లేకుండా కామినేని శ్రీనివాస్ కు టికెట్ ఎలా కేటాయించారు అని కైకలూరు లో నియోజకవర్గ స్థాయి మీటింగ్ నాలుగు మండలాల పరిధిలోని నాయకులతో భైరవ పట్నంలో శుభం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కి ఏలూరు జిల్లా నుండి యాదవ సామజిక వర్గాలు, జనసేన నాయకులు, బిజెపి, టీడీపీ నాయకులు హాజరయ్యారు. జనసేన నాయకులు మాట్లాడుతూ జెండా భుజాన వేసుకొని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి కష్టపడితే ఇదేమి న్యాయం అంటూ ప్రశ్నించారు . ఇక యాదవ సామజిక వర్గాలు బీసీ లకు ఏలూరు జిల్లా లో ఓక్క సీటు కేటాయించలేదు, యాదవ సామజిక వర్గానికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారు. ఈసారి ఎలక్షన్ లో పోటి చేసి తీరాల్సిందే అని తీర్మానించారు.
బీవీరావు మాట్లాడుతూ నాకు టికెట్ ఇస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పారు ఆలాగే కష్ట పడ్డాను , ఇప్పుడు బిజెపికి టికెట్ కేటాయించారు అని నాకు అయితే పవన్ కళ్యాణ్ చెప్పలేదు కాభట్టి నేను 2024 సార్వత్రిక ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేస్తున్న ఏప్రిల్ 19 న నామినేషన్ వేస్తున్న అని ప్రకటించారు. ఈ టికెట్ కార్చిచ్చు కైకలూరులో కూటమిని దహించివెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది.