నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది, రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే లేవనీ, నిరుద్యోగ రేటు ఎక్కువైపోయిందనీ, యువత పక్క రాష్ట్రాలకు తరలివెళ్లిపోతుంది అంటూ పదే పదే అసత్యాలు చెపుతూ గుండెలు బాదుకునే బాబుకి ఇటువంటి వార్తలు వినే అలవాటు ఉండదు. విన్నా అంగీకరించే తత్త్వమూ కాదు కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి.
ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పుడల్లా వెంటనే భర్తీ చేయించడానికి చూసే జగన్ ప్రభుత్వం ప్రస్తుతం, అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి (హెస్ఆర్) చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకు అనుమతించారు. ఆయా పోస్టుల అర్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇలా ఒక్కొక్క శాఖలో జగన్ ఉద్యోగాలను ఇచ్చుకుంటూ పోతున్నా జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అనటం మాత్రం మానరు టీడీపీ అండ్ కో