2024లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెందుర్తి లో నాగబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెందుర్తి నియోజక వర్గానికి చెందిన మరో జనసేన సీనియర్ నాయకుడు శివశంకర్ కు ఆహ్వానం అందలేదు, దీనితో కోపోద్రిక్తులైన శివశంకర్ వర్గం పంచకర్ల రమేష్ బాబు పైన అసహనం వ్యక్తం చేశారు. ప్రాంగణ వేదికకు చేరుకున్న ఇరు వర్గాలు కొట్టుకోవడానికి సిద్ధం అయ్యారు, అంతలోనే సభ ప్రాంగణంలోకి నాగబాబు చేరుకుంటున్నాడు అని తెలిసి గొడవను తాత్కాలికంగా ఆపారు.
టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ తనకే వస్తుంది అంటూ పంచకర్ల రమేష్ బాబు సోషియల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. మరోవైపు సీనియర్ నాయకుడు నన్ను కాదని వేరే ఒకరికి ఇస్తే పనిచేయను అని శివశంకర్ తెలుపుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి గానీ, జనసేన నుంచి శివశంకర్ కి వస్స్తేనే పరస్పరం సహకరించుకుంటూ పనిచేస్తాం అని రాని యెడల పని చేయం అని ఇరువురు స్పష్టం చేశారు. కొసమెరుపు ఏంటి అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 5.6 శాతం ఓట్లు నమోదు చేసుకున్న జనసేన పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ పరిస్థితి ఏంటో అర్థంకావడం లేదు.